‘అల వైకుంఠపురములో…’ నిర్మాత ఎవరు? ఈ ప్రశ్న అడగంగానే ఆ సినిమాను నిశితంగా పరిశీలించేవాళ్లయితే హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ అని చెబుతారు. మామూలు ప్రేక్షకుడు అయితే గీతా ఆర్ట్స్ అని మాత్రమే చెబుతారు. కారణం సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో గీతా ఆర్ట్స్ డామినేషన్ కొనసాగడమే. ఎక్కడ చూసినా అల్లు అరవింద్ టీమే కనిపించారు. ‘మా నాన్న నాకు ఈ సినిమా చేసిపెట్టారు’ అంటూ బన్నీకి గర్వంగా చెప్పుకున్నట్లు గుర్తు.
‘అల వైకుంఠపురములో’ సినిమాను తొలుత నుండి ఫాలో అవుతున్నవాళ్లకు ఓ విషయం క్లారిటీ ఉండి ఉండొచ్చు. తొలుత ఈ సినిమా అనుకున్నప్పుడు హారిక హాసిని క్రియేషన్స్ పేరే వినిపించింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ యాడ్ అయ్యింది. అల్లు అర్జున్ హీరో కాబట్టి సినిమా లాభాల్లో వాటా ఉంటుంది కాబట్టి, గీతా ఆర్ట్స్ యాడ్ అయ్యిందేమో అనుకున్నారు. కానీ సినిమా వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్, ఆ మీట్, ఈ మీట్‌లో అల్లు అరవింద్ యాక్టివ్ అయ్యారు. హారిక హాసిని టీమ్‌ను మెల్లగా కూర్చోబెట్టారు.
రాధాకృష్ణ (చినబాబు) కానీ, ఆయన తనయుడు నాగవంశీకి సినిమా గురించి చెప్పుకునే అవకాశం, తమ సంస్థ ఈ సినిమా గొప్పగా తీసిందని చెప్పుకునే అవకాశం రాలేదు. ఈ సినిమా ఇచ్చిన అనుభవం ఏమో కానీ… తర్వాతి సినిమా విషయంలో చినబాబు చాలా ప్లాన్డ్‌గా వెళ్లారు. సోలో ప్రొడ్యూసర్‌గా ఉంటేనే మంచిదని అనుకున్నట్లున్నారు. అందుకే మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాకు సోలో నిర్మాతగానే ఉన్నారు. మామూలుగా సినిమా అంటే మహేష్ బ్యానర్ నేమ్ పోస్టర్‌పై కనిపిస్తుంది. కానీ ఈ పోస్టర్‌లో కనిపించలేదు. సోలో ప్రొడ్యూసర్ ఫీలే వేరు కదా మరి!
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!