బిగ్ బాస్ 4: నీకు మేమున్నాం మోనాల్..!

ఈవారం కెప్టెన్ అయిన హారికకి అనూహ్యంగా ఒక పవర్ వచ్చింది. 12వ వారం నామినేషన్స్ లో భాగంగా నామినేట్ అయినవారిని , సేప్ అయిన వారిలోనుంచి ఒకరిని స్వాప్ చేసుకోవచ్చు. ఈ బాధ్యతని కెప్టెన్ అయిన కారణంగా హారికకి అప్పజెప్పాడు బిగ్ బాస్. నిజానికి ఇది కత్తిమీద సాములాంటింది. కానీ, హారిక చాలా జెన్యూన్ గా రీజన్స్ చెప్తూ మోనాల్ ని అభిజిత్ తో స్వైప్ చేసింది.

సోహైల్ తో మాట్లాడుతూ ఫస్ట్ నుంచి అంటే నైబర్ హౌస్ నుంచి నువ్వు ఇక్కడి వరకూ రావడంలో నీ గేమ్ నాకు కనిపిస్తోంది. నువ్వు చేసిన త్యాగాలు, ఫ్రెండ్షిప్ కి నువ్విచ్చిన విలువ వీటన్నింటిని చూస్తే నీ గ్రాఫ్ ఇప్పటివరకూ తగ్గలేదని చెప్పింది. అంతేకాదు, నువ్వు ఇంట్లో ఉండటానికి అనర్హుడివి అని చెప్పడానికి నాకు పాయింట్స్ దొరకట్లేదని చెప్పింది.

అలాగే మోనాల్ తో మాట్లాడుతూ ఓవర్ ఆల్ గా నీ గేమ్ గత కొద్దివారాలుగానే బాగుందని, ముందు కూడా బాగా ఆడావ్ కానీ నోటీస్ కి వచ్చింది మాత్రం ఇప్పుడే అని చెప్పింది. అలాగే, నన్ను కెప్టెన్ చేసిన నిన్ను స్వాప్ చేయలంటే చాలా బాధగా ఉందని చెప్పింది. ఫైనల్ గా తను చాలా జెన్యూన్ రీజన్ చెప్పి మోనాల్ ని స్వైప్ చేసింది. ఇక్కడే హారిక మాట్లాడిన మాటలకి కన్విన్స్ అయ్యింది మోనాల్.

అంతమంది మాట్లాడినా కన్విన్స్ అవ్వని మోనాల్ హారిక చెప్పిన రీజన్స్ కి కూల్ అయ్యింది. అంతేకాదు., రైట్ పర్సన్ తో నన్ను స్వాప్ చేయమని అడిగింది. దీంతో హారిక అభిజిత్ తో స్వాప్ చేసింది. ఇక్కడే హారికకి ఇచ్చిన పవర్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంది. ఇప్పుడు హారిక ఆడిన గేమ్ కి పాజిటివ్ గా స్పందిస్తున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. హారిక మరేం పర్లేదు., మోనాల్ ని సేఫ్ చేయడానికి మేమున్నాం అంటూ అభిజిత్ అండ్ హారిక ఫ్యాన్స్ భరోసాని ఇస్తున్నారు. ఇక్కడ హారిక తీస్కున్న డెసీషన్ లో ఎలాంటి తప్పు లేదనిపించింది. అంతేకాదు, చాలామంది నెటిజన్స్ కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. మరి హారిక చేసింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus