Dhanush, Aishwarya: దీపావళికి రజనీకాంత్‌ ఇంట్లో భేటీ.. ధనుష్‌ – ఐశ్వర్య గుడ్‌ న్యూస్‌ వింటామా?

కొన్ని పుకార్లు చికాకు తెప్పిస్తాయి. మరికొన్ని పుకార్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ పుకారు నిజమైతే బాగుండు అని కూడా అనిపిస్తుంది. అలాంటి వాటిలో ఒకటి ధనుష్‌ (Dhanush) – ఐశ్వర్య (Aishwarya)  మళ్లీ ఒక్కటవ్వడం. అవును రెండేళ్ల క్రితం విడిపోతాం అంటూ ప్రకటించిన ఈ జోడీ తిరిగి కలుస్తారు అని గత కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి. దీని కోసం ఇరు కుటుంబాల పెద్దలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారనే మాటలు వింటూనే ఉన్నాం. తాజాగా ఈ విషయంలో కీలకమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది అంటున్నారు.

Dhanush, Aishwarya:

చెన్నై సమాచారం ప్రకారం అయితే.. ఇటీవల దీపావళి నాడు ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది అని చెబుతున్నారు. కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకోబోతున్న హీరో ధనుష్, రజనీకాంత్ (Rajinikanth)  కుమార్తె ఐశ్వర్య తిరిగి కలవడానికి మొదటి అడుగు పడింది అని చెబుతున్నారు. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా.. బయట సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి అంటున్నారు. ధనుష్‌, ఐశ్వర్య మధ్య సయోధ్య కుదిర్చేందుకు రజనీకాంత్ ప్రయత్నాల్లో భాగంగా దీపావళి నాడు ఇంటికి ధనుష్‌ను ఆహ్వానించారట.

విడాకుల విషయంలో మరోమారు ఆలోచించుకోండి అని ధనుష్‌, ఐశ్వర్యకు తలైవా చెప్పారు అని అంటున్నారు. తన జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కోరిక ఇదేనని రజనీకాంత్‌ తన వేదనను చెప్పారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్‌ కాస్త మెత్తబడ్డాడు అని కూడా అంటున్నారు. సినిమాలకు సంబంధించి అయితే పుకార్లను బలంగా నమ్మొచ్చు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం కాబట్టి.. అంత ఈజీగా పక్కాగా చెప్పేయలేం.

అయితే జరిగితే బాగుండు అనే మాట అయితే సినిమా సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇక 18 ఏళ్లు కలసి కాపురం చేసిన తర్వాత ధనుష్ – ఐశ్వర్య విడిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి రెండేళ్లు అవుతోంది. అయితే ఈ విషయం ఇంకా తేలలేదు. దానికి కారణం ఇరు కుటుంబాల పెద్దలు సయోధ్య కోసం చేస్తున్న ప్రయత్నాలే అని వార్తొచ్చాయి. ఇప్పుడు అదే జరిగింది అని అంటున్నారు.

‘స్పిరిట్‌’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్‌.. ఏమేం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus