Spirit: ‘స్పిరిట్‌’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్‌.. ఏమేం చెప్పారంటే?

ప్రభాస్‌ (Prabhas) చేతిలో వరుస సిఇనమాలు ఉన్నాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అనే అప్‌డేట్‌ అయితే సరిగ్గా ఉండటం లేదు. త్వరలో అనేలా ప్రచారం మొదలుపెట్టిన సినిమాలు ఆ తర్వాత కామ్‌ అయిపోతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ప్రారంభం ఎప్పుడు అనేది కూడ తేలడం లేదు. ఒక సినిమా సంగతి తేలినా మిగిలినవి ఊహించేసుకుంటాం అనే మాటలు అభిమానుల నోట వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ‘స్పిరిట్‌’ (Spirit)  సినిమా అప్‌డేట్‌ వచ్చింది.

Spirit

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’ ముంబయి – అండర్‌ వరల్డ్‌ నేపథ్యంలో పోలీస్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని గతంలో వార్తలొచ్చాయి. సినిమా ప్రీ లుక్‌, పోస్టర్ల బట్టి చూసినా అదే అర్థమవుతోంది. ఇటీవల మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభించుకున్న ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ను నిర్మాత భూషణ్‌ కుమార్‌ (Bhushan Kumar) వెల్లడించారు. ప్రస్తుతం ‘స్పిరిట్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నామని తెలిపారు. ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెప్పిన భూషణ్‌ కుమార్‌..

త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఫైనల్‌ అయిన నటుడు ప్రభాస్‌ ఒక్కడే అని తేలిపోయింది. కాస్టింగ్‌ పనులు అయ్యాక సినిమా షూటింగ్‌ మొదలుపెడతామని చెప్పారు. మోస్ట్‌లీ డిసెంబర్‌ చివరిలో చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశం ఉంది అని చెప్పారు. దీంతో త్వరలోనే ‘స్పిరిట్’ అప్‌డేట్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇక ‘స్పిరిట్‌’ సినిమా గురించి సందీప్ వంగా గతంలో ఓసారి మాట్లాడుతూ.. తొలి రోజే మా సినిమా ఇది రూ.150 కోట్లు వసూళ్లు చేస్తుందని చెప్పారు.

ఇప్పటివరకు ప్రభాస్‌ను స్క్రీన్‌ మీద చూసింది ఒక లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్క అని కూడా చెప్పారు. అంటే ‘ది రాజా సాబ్‌’ (The Rajasaab) తర్వాత మొదలవుతాయి అనుకున్న ‘సలార్‌ 2’(Salaar), ‘కల్కి 2’(Kalki 2898 AD) ఇంకా చాలా టైమ్‌ తీసుకుంటాయన్నమాట. సందీప్‌ రెడ్డి బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘యానిమల్‌’ (Animal) సీక్వెల్‌ గురిచి కూడా భూషణ్‌ కుమార్‌ మాట్లాడారు. ‘స్పిరిట్‌’ (Spirit) పనులు అయ్యాక ఆరు నెలల గ్యాప్‌ తీసుకొని.. ‘యానిమల్‌ పార్క్‌’ మొదలుపెడతామని చెప్పారు.

తెలుగు వారిపై కామెంట్లు.. కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదు.. ఇంకా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus