సినిమాల విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ బాగుంటుంది అని చెబుతుంటారు టాలీవుడ్ జనాలు. అందుకే ఆయన ప్రొడ్యూసర్ కెరీర్‌లోని 50 సినిమాల్లో ఎక్కువ శాతం హిట్‌లు వచ్చాయి అని చెబుతుంటారు. అయితే రీసెంట్‌గా ఆయన జడ్జిమెంట్ విషయంలో ఏదో తేడా కొడుతుందా? ఏమో ఆయన సినిమాల ఫలితం చూస్తే అదే అనిపిస్తోంది. అందులోనూ ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బాలీవుడ్ ఎంట్రీ. రీసెంట్‌గా హిందీ సీమలో రెండు సినిమాలు చేస్తూ రెండూ ఫట్ మన్నాయి.
మరికొన్ని నిర్మాణ సంస్థలతో కలసి దిల్ రాజు నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. షాహిద్ కపూర్ ‘జెర్సీ’, రాజ్‌కుమార్ రావ్ ‘హిట్’ అలా చేసినవే. ఈ రెండు సినిమాలు తెలుగులో అదే పేరుతో వచ్చి హిట్ కొట్టినవే. అయితే అక్కడ మాత్రం దారుణంగా పరాజయం పాలయ్యాయి. బాలీవుడ్ ఎంట్రీకి హిట్ కథల్నే ఎంచుకున్నా.. ఎందుకు విజయం దక్కడం లేదు అని దిల్ రాజు మరోసారి స్ట్రాటజీని రీచెక్ చేసుకుంటున్నారట.
అయితే అక్కడి కథల్ని అక్కడ చూపించకుండా, మన కథల్ని కొత్త పుస్తకం మీద రాస్తే ఇలానే ఉంటుందనే సూచన ఆయన దగ్గరకు వెళ్లిందట. ఇక్కడో విషయం ఏంటంటే.. తెలుగులో విజయవంతమైన అల్లరి నరేశ్ ‘నాంది’ రీమేక్ రైట్స్ దిల్ రాజు దగ్గరే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను బాలీవుడ్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఇప్పుడు వరుసగా రెండు ఫ్లాపులు వచ్చాయి. దీంతో ఆ సినిమా విషయంలో రీథింక్ చేస్తారు అని అంటున్నారు.
అయితే ఇలాంటి ఫలితాలకు ఆయన భయపడేవారు కాదనే విషయం గుర్తుంచుకోవాలి. సినిమా నిర్మాణ రంగంలో ఇలాంటివి చాలానే ఉంటాయి. అయితే సరైన సినిమా పడేవరకు ఇబ్బంది తప్పదు. దిల్ రాజు ఇప్పుడు 50 సినిమాలు పూర్తి చేసుకుని మంచి ఊపు మీదున్నారు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే, కోలీవుడ్‌లో కూడా సినిమా చేస్తున్నారు. అయితే ఎక్కడి స్ట్రాటజీ అక్కడ వాడాలని బాలీవుడ్ నేర్పింది. దీంతో మిగిలిన పరిశ్రమల విషయంలో దిల్ రాజు అప్రోచ్ మారుతుందేమో చూడాలి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!