మహేష్ బాబు గత నాలుగు సినిమాలు చూసుకుంటే మెసేజ్ తో కూడుకుని ఉంటాయి. ఆ సినిమాల్లో విలన్స్ ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు హీరో(మహేష్). మరోపక్క త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే.. అతని సినిమాల్లో ఓ పెద్ద కంపెనీ, ఆ కంపెనీలో ఒక సమస్య.. మరోపక్క ఓ పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ లో ఓ సమస్య.. ఆ రెండు సమస్యలను తీర్చడానికి హీరో ఆ పెద్ద ఫ్యామిలీ వద్దకి వెళ్లడం.. ఇలాగే ఉంటుంది టెంప్లేట్.
ఈ క్రమంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ చేశారు అనగానే.. వీళ్ళ గత సినిమాల్లానే కథాకథనాలు ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇటీవల విడుదలైన ‘గుంటూరు కారం’ గ్లింప్స్ .. ఇది పక్కా మాస్ సినిమా అనే భావన అందరికీ కలిగించింది. కానీ ఇది కూడా ఫ్యామిలీ సినిమానే అనేది ఇన్సైడ్ టాక్. కాకపోతే విలేజ్ నేపథ్యంలో సాగే మాస్ ఫ్యామిలీ డ్రామా. ముందుగా కారం రుచి చూపించాడు త్రివిక్రమ్.
(Guntur Karam) ‘గుంటూరు కారం’తో చేసిన ఆవకాయ ముద్దతో ఎలా ఉంటుందో ఈ గ్లిమ్ప్స్ తో చూపించారు. మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9 నాడు మరో రుచి చూపిస్తారు. ట్రైలర్లో స్వీట్ అంటే ఫ్యామిలీ అంశాలు కూడా ఉంటాయని రివీల్ చేస్తారు. 13 ఏళ్ళ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా ఇది. మరి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఇందులో ఉండాలి కదా.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!