Hrithik Roshan: కుర్ర దర్శకుడికి బాలీవుడ్‌ స్టార్‌ను ఇస్తున్నారా?

‘కార్తికేయ’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు చందూ మొండేటి. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించినంతగా ఆడకపోయినా.. ‘కార్తికేయ 2’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఈ సారి కేవలం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటారు. హిందీ నాట ఆ సినిమాకు, ఆ సినిమా టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు.. ఏకంగా పాన్‌ ఇండియయా సినిమా అవకాశాన్నే తీసుకొచ్చింది అంటున్నారు.

‘కార్తికేయ 2’ సినిమా విజయం చూసిన తర్వాత.. ఆ సినిమా దర్శకుడు చందూ మొండేటికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అడ్వాన్స్ ఇచ్చారని వార్తలొచ్చాయి. దాంతో చందూ తర్వాతి సినిమా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే ఉంటుందని అన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే.. మరో టాలీవుడ్‌ దర్శకుడు ఇతర పరిశ్రమలోకి వెళ్తున్నట్లు. ఎందుకంటే గీతా ఆర్ట్స్‌ తన నెక్స్ట్‌ సినిమాను బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో చేస్తోందని టాక్‌ నడుస్తోంది.

హృతిక్‌తో అల్లు అరవింద్‌ చేయబోయే సినిమాకు చందూ మొండేటి దర్శకుడు అని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నారట. వన్స్‌ ఓకే అనుకుంటే.. పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ సిద్ధం చేయడానికి చందూ మొండేటి రెడీ అవుతున్నారట. అంతేకాదు ఈ సినిమా విషయంలో రణ్‌బీర్‌ కపూర్‌ పేరు కూడా వినిపించింది. కానీ గీతా ఆర్ట్స్‌ టీమ్‌… ఈ సినిమాకు హృతిక్‌నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది అంటున్నారు.

అయితే, ఈ విషయంలో హృతిక్‌ నుండి కానీ, గీతా ఆర్ట్స్‌ టీమ్‌ నుండి కానీ ఎలాంటి స్పందనా లేదు. త్వరలో ఈ ఇద్దరి నుండి భారీ స్థాయిలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌లు సౌత్‌ వైపు చూస్తున్న ఈ రోజుల్లో చందూ మొండేటి ఈ అవకాశం రావడం చాలా పెద్ద విషయమే. ఎందుకంటే కొత్త కుర్రాళ్లు ఇది చూసి మరింత మెరుగైన కంటెంట్‌ ఇస్తారు కాబట్టి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus