Jr NTR: ‘వార్ 2’ స్క్రిప్ట్ లో మార్పులు కోరిన తారక్..!

టాలీవుడ్లో కొన్ని దశాబ్దాల తర్వాత రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) మూవీ. రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రంలో రాంచరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR) …లు హీరోలుగా నటించారు. మొదటి నుండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. తెలుగు సినిమాకి ఆస్కార్ ను కూడా తెచ్చిపెట్టింది.తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా బ్రహ్మాండంగా ఆడింది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం. అయితే తెలుగు వెర్షన్ ను చూసిన తర్వాత హీరోలకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వలేదు రాజమౌళి అంటూ కొంతమంది పెదవి విరిచారు.

Jr NTR

రాంచరణ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసినట్టు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చి.. ఇష్యుకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఓ ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్’ అంటూ చేసిన కామెంట్లు ఎన్టీఆర్ అభిమానులకి చురకలు పెట్టినట్టు అయ్యింది.

బహుశా ఈ ఫ్యాన్ వార్స్ చూసే అనుకుంటాను.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్లో హృతిక్ తో (Hrithik Roshan) కలిసి చేస్తున్న ‘వార్ 2’ స్క్రిప్ట్ విషయంలో అతను కొన్ని మార్పులు కోరినట్టు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. అయితే మరీ డామినేట్ అవ్వకుండా.. ఎన్టీఆర్ దర్శకుడు అయాన్ ముఖర్జీతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సూచించాడట. బాలీవుడ్లో ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ మూవీ కాబట్టి.. ఎన్టీఆర్ ఆలోచన కూడా కరెక్టే..!

పెళ్లి తేదీ గురించి అదితి జవాబిదే.. ఆ తేడా తెలియాలని చెబుతూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus