Jr NTR, Bhansali: ఇలాంటి కాంబో కుదరాలే కానీ… బొమ్మ అదుర్స్‌ అంతే!

కొన్నిసార్లు ట్విటర్‌లో సరదాగా సాగే.. సంభాషణ నిజమైపోతుంటుంది. అలా ఇప్పుడు టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందు ఊరిస్తున్న ట్విటర్‌ సంభాషణ తారక్‌ – భన్సాలీ కాంబో. అవును బాలీవుడ్‌లో భారీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంజయ్‌ లీలా భన్సాలీ… తన తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తో చేస్తారనేదే ఆ ట్విటర్‌ డిస్కషన్‌ సారాంశం. అంతేకాదు ఇప్పటికే వీరిద్దరూ మాట్లాడుకున్నారని కూడా అంటున్నారు.

సంజయ్‌ లీలా భన్సాలీ ప్రస్తుతం ‘గంగూభాయ్‌ కతియావాడీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. చిన్నతనంలో కమాతిపురలో వేశ్య గృహానికి అనుకోని పరిస్థితుల్లో చేరిన కథానాయిక… ఆ తర్వాత ఆ ప్రాంతానికే నాయకురాలు అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 6న విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేశారట. దాని గురించి ఇప్పటికే చర్చలు కూడా నడిచాయట.

నిజానికి భన్సాలీ ‘బై బావ్‌రా’ అనే సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీని కోసం బాలీవుడ్‌ స్టార్లతో మంతనాలు జరుపుతున్నారని కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఆ సినిమా గురించే మాట్లాడారా.. లేక వేరే సినిమా గురించి మాట్లాడారా అనేది తెలియాలి. అంతేకాదు అసలు ట్విటర్‌ డిస్కషన్‌ నిజమా కాదా అనేది కూడా తెలియాలి. ఒకవేళ ఇదే కానీ జరిగితే… బొమ్మ మామూలు అదుర్స్‌ కాదు. డబుల్‌, ట్రిపుల్‌ అదుర్స్‌ అంతే.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus