Devara: ‘దేవర’ కోసం ఎన్టీఆర్‌ రిస్క్‌ చేస్తున్నాడా? రాజకీయ ప్రకంపనలు వస్తాయా?

  • July 22, 2023 / 02:51 PM IST

కొరటాల శివ సినిమాలో మాస్‌ మెటీరియల్‌, స్టార్‌ హీరోల కంటెంట్‌ ఎంత ఉంటుందో… సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలూ అంతే ఉంటాయి. కావాలంటే చూడండి తొలి సినిమా నుండి సమాజంలో ఏదో మార్పు కోసం ఆయన చేసే ప్రయత్నాలే కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయన సమాజంలో జరిగిన, జరుగుతున్న కీలక అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఆయన ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘దేవర’ సినిమాలోనూ ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు అని తెలుస్తోంది.

భయానికి భయం పుట్టించే శక్తి లాంటి వ్యక్తి కథ ఇది అంటూ ‘దేవర’ సినిమా గురించి చెబుతున్నారు. రక్తం పారుతున్న ఫొటోలు లుక్‌లో చూశాం. ఓ తీర ప్రాంతం / దీవి లాంటి ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది అని కూడా చెప్పేశారు. అయితే ఇలా చెబుతున్నా.. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన చాలా కీలకమైన ఓ అంశం గురించి ప్రస్తావించబోతున్నారు అని తెలుస్తోంది. నేరుగా ఆ విషయం చెప్పకపోయినా.. అప్పుడు జరిగిన అంశాల స్ఫూర్తితో ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయట.

‘దేవర’ (Devara) సినిమాలో దళితులపై జరిగిన క్రూరమైన హత్యాకాండ ఆధార సన్నివేశాలు ఉంటాయి అని అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందిన కారంచేడులో జరిగిన విషాద ఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయట. 1985లో కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. అందులోని కొన్ని అంశాలు ఇప్పుడు ‘దేవర’లో ఉంటాయని అంటున్నారు. అయితే అదే పేరుతో చూపిస్తారా అనేది చూడాలి.

‘మిర్చి’లో ఫ్యాక్షన్ గొడవలు, ‘శ్రీమంతుడు’లో విలేజ్ అడాప్టేషన్, ‘భరత్ అనే నేను’లో రాజకీయాల్లో జవాబుదారీతనం, ‘ఆచార్య’లో నక్సలైట్ ఉద్యమాలను పొందుపరిచారు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’లో వర్ణాలు / వర్గాల మధ్య పోరు గురించి చూపిస్తారని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus