Koratala Siva: ఎన్టీఆర్‌ సినిమా తర్వాత కొరటాల ప్రాజెక్ట్‌ అదేనా!

మెగా ఫ్యాన్స్‌ ఏదైనా దర్శకుడు పేరు వింటే ఉలిక్కిపడతారు అంటే.. ఇన్నాళ్లూ అది బోయపాటి శ్రీను. ‘వినయ విధేయ రామ’గా ఆయన ఇచ్చిన సినిమా మామూలుగా రాడ్డు రంపోలా కాదు అంటుంటారు. అయితే ‘ఆచార్య’ వచ్చాక బోయపాటికి కొరటాల శివ కంపెనీ ఇచ్చారు అని చెప్పొచ్చు. ‘ఆచార్య’ ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని కూడా అంటుంటారు. అలాంటి కొరటాలతో రామ్‌చరణ్‌ మరో సినిమా చేస్తారా? ఏమో ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది.

కొరటాల నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ అంటే ఎన్టీఆర్ సినిమానే. తారక్‌ 30వ సినిమా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో మొదలవుతుంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అన్నీ పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్తారట. ఆ సినిమా తర్వాత కొరటాల ప్రాజెక్ట్‌ ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పడు రామ్‌చరణ్‌ సినిమా బయటికొచ్చింది. తారక్ సినిమాతో కొరటాల చేయబోయేది రామ్‌చరణ్‌తోనే అంటున్నారు. నిజానికి చాలా రోజుల క్రితమే ఇది ఫిక్స్‌ అయ్యిందనే మాటలూ వినిపిస్తున్నాయి.

కొర‌టాల శివ‌ – ఎన్టీఆర్‌ సినిమా పాన్‌ ఇండియా రేంజిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌ ఇప్పట్లో వర్కౌట్‌ అయ్యేలా కనిపించడం లేదట. అందుకే ఎన్టీఆర్‌తో సినిమా తర్వాత చరణ్‌తో సినిమా చేయాలని కొరటాల అనుకుంటున్నారట. మామూలుగా అయితే ఇది చాలా క్రేజీ ప్రాజెక్ట్‌. కానీ ‘ఆచార్య’ ఫలితం మెగా ఫ్యాన్స్‌ను భయపెట్టేసింది. దీంతో ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.

ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతో సినిమా చేయాల‌ని కొరటాల శివ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌తో సినిమా తర్వాత చరణ్‌తో సినిమా చేస్తాడట. ఆ తర్వాత బాలకృష్ణతో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ తర్వాతేంటి అనేది కూడా ఆసక్తికరమే. హీరోల ఇమేజ్ బట్టి కథలు రాసే కొరటాల… చరణ్ కోసం ఎలాంటి కథ రాశారో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus