Mahesh Babu, Vijay: విజయ్‌ సినిమాలో మహేష్‌ అంట.. నిజమేనా..!

ఒక స్టార్‌ హీరో సినిమాలో మరో స్టార్‌ నటించడం, కేమియోలు చేయడం ఇటీవల కాలంలో చాలా అరుదు. గతంలో పెద్ద హీరోలు చాలామంది ఇలాంటివి చేసేశారు. అయితే ఇప్పటి హీరోలు మాత్రం ఇలాంటి స్వీట్‌ కేమియోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్‌బాబు కూడా కేమియో చేయడానికి సిద్ధమవుతున్నారా? అవుననే అంటున్నాయి. టాలీవుడ్‌ వర్గాలు. అయితే అది తెలుగు సినిమాలో కాదు తమిళ సినిమాలో అని టాక్‌. మహేష్‌బాబుకి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి క్రేజ్‌ ఉంది.

దాని దృష్ట్యానే మహేష్‌ను కేమియో చేయాల్సిందిగా ప్రముఖ దర్శకుడు, మహేష్‌ స్నేహితుడు అని వంశీ పైడిపల్లి అడుగుతున్నారట. ప్రస్తుతం వంశీ.. విజయ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా మొదలైంది. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. ఈ మేరకు పోస్టర్లు కూడా వచ్చాయి. అయితే అందులో స్వీట్‌ సర్‌ప్రైజ్‌గా మహేష్‌ను నటించమంటున్నారట. విజయ్‌ సినిమాకు నిర్మాత దిల్‌రాజు. మహేష్‌కి, ఆయనకు మధ్య మంచి ర్యాపో ఉంది. ఇక వంశీ.. మహేష్‌కి మంచి స్నేహితుడన్న విషయం తెలిసిందే.

ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుంటే విజయ్‌ సినిమాలో మహేష్‌ నటించడానికి ఒప్పించడం అంత పెద్ద విషయమేమీ కాదు. మరోవైపు మహేష్‌కి, విజయ్‌కి కూడా మంచి స్నేహబంధమేఉంది. ఈ మొత్తం కాన్సెప్ట్స్‌తో విజయ్‌ సినిమాలో మహేష్‌ అనే స్క్రిప్టు ఫలించేలా ఉంది. ఇక ఈ సినిమాను దిల్‌ రాజు వచ్చే సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నారు. ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక మందన నటిస్తోంది.

తొలుత ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి, ఆ తర్వాత తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తామని ఆ మధ్య విజయ్‌ చెప్పాడు. అయితే ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కుతోందని చిత్ర నిర్మాణ సంస్థ చెబుతోంది. సినిమా విడుదలైతే కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. అప్పటివరకు కాంబో కోసం వెయిట్‌ చేయడమే.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus