Mahesh,Prabhas: ఒకే సినిమాలో ప్రభాస్, మహేష్ బాబు.. కానీ?

సినిమా ఇండస్ట్రీకి చెందిన అభిమానులలో కొందరు అభిమానులు ఇద్దరు లేదా ముగ్గురు హీరోలను అభిమానిస్తారు. అలాంటి అభిమానులు తమ ఫేవరెట్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుందని ఆశించడం సాధారణంగా జరుగుతోంది. కలిసి నటించడం సాధ్యం కాకపోతే గెస్ట్ రోల్ లో నటించినా, వాయిస్ ఓవర్ ఇచ్చినా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ప్రభాస్, మహేష్ లను కామన్ గా ఆభిమానించే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలలో ప్రభాస్ (Prabhas) , మహేష్ (Mahesh Babu) ముందువరసలో ఉంటారు.

అయితే కల్కిలో (Kalki 2898 AD) ఒక పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ప్రభాస్ ఈ సినిమాలో విష్ణు అవతారంలో కనిపించనున్నారని ఆ పాత్రను పరిచయం చేయడానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం లుక్ ను మార్చుకునే పనిలో బిజీ అయిపోయారు. గతంలో పలు సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే (Deepika Padukone) , దిశా పటానీ (Disha Patani) కల్కి సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. కల్కి సినిమా 600 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కల్కి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఒకింత భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

కల్కి సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయి. కల్కి సినిమా ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. వచ్చే నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus