Chiranjeevi: ఆగస్టు 22 డల్‌గా ఉంటుందా? ఏమైనా సర్‌ప్రైజ్‌లు ఉంటాయా?

అభిమాన హీరో పుట్టిన రోజు అంటే… ఫ్యాన్స్‌ అప్‌డేట్స్‌ కోసం, స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ల కోసం సిద్ధంగా ఉంటారు. అందులోనూ స్టార్‌ హీరోల అభిమానులైతే ఇంకా ఎక్కువగా రెడీగా ఉంటారు. ఇప్పుడు సమీప సమయంలో రాబోయే పుట్టిన రోజు అంటే మెగాస్టార్‌ చిరంజీవిదే. ఆకబట్టి ఇప్పుడు మేం చెబుతున్నది చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజే అని ఈజీగా చెప్పేయొచ్చు. ఈ ఆగస్టు 22న చిరంజీవి ఫ్యాన్స్‌కి ఏమేం సర్‌ప్రైజ్‌లు వస్తాయి అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే చిరంజీవి సన్నిహిత వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే… చిరంజీవి నుండి ఎలాంటి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన కొత్త సినిమా షూటింగ్‌కి హాజరయ్యే పరిస్థితి లేదు అంటున్నారు. సర్జరీ విషయంలో స్పష్టమైన సమాచారం లేకపోయినా… ఇప్పటికప్పుడు అయితే చిరు బయటకు రారు అంటున్నారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమా పోస్టర్లు, షూటింగ్‌లు, వీడియోలు, అనౌన్స్‌మెంట్‌లు ఏవీ ఈ ఆగస్టు 22న రాకపోవచ్చు. ఒకవేళ వస్తే సినిమా సీరియల్‌ నెంబర్‌ను చెబుతూ పోస్టర్లు పడొచ్చు అంటున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలో కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని అని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఆ సినిమా ముహూర్తమో, లేక స్పెషల్‌ వీడియోనో వస్తుంది అనుకున్నారు. కానీ అదేమీ ఉండదు అంటున్నారు.

ఇక చిరంజీవి (Chiranjeevi) లైనప్‌లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. నిర్మాణ సంస్థలు ఫిక్స్‌ అయ్యాయి కానీ దర్శకులు అవ్వలేదు. డీవీవీ దానయ్య, కేఎస్‌ రామరావు, దిల్‌ రాజు, యూవీ క్రియేషన్స్‌, రాధిక (రాడాన్‌), పీపుల్‌ మీడియా బ్యానర్లకు చిరంజీవి సినిమాలు చేయాలి. మరి వాటికి సంబంధించిన ఇన్ఫో పోస్టర్లు రావొచ్చు. అవి వచ్చినప్పుడు వాటి దర్శకులు తదితర విషయాల గురించి స్పష్టత వస్తే రావొచ్చు. చూద్దాం ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus