Mehreen: మెహ్రీన్ కొటేషన్ వెనుక అర్థం ఇదేనా?

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మెహ్రీన్ పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోయినా నటిగా మెహ్రీన్ కు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. కొన్ని రోజుల క్రితం మెహ్రీన్ నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. మరోవైపు ఈ మధ్య కాలంలో మెహ్రీన్ పెళ్లి రద్దు చేసుకొని వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.

హర్యాణా మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఎంగేజ్ మెంట్ ను మెహ్రీన్ బ్రేక్ చేసుకున్నారు. మెహ్రీన్ పెళ్లి రద్దు అని ప్రకటించినా అందుకు సంబంధించిన కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.వరుస ఆఫర్లతో మెహ్రీన్ బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించినా మెహ్రీన్ కు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. పలు పెద్ద సినిమాలలో మెహ్రీన్ కు ఛాన్స్ వచ్చినా రెమ్యునరేషన్ సమస్య వల్ల ఆమె రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మెహ్రీన్ మనస్సులో మాత్రం పెళ్లి క్యాన్సిల్ అయిన బాధ ఉందని తెలుస్తోంది.

తాజాగా ఆమె ఒక కొటేషన్ ను షేర్ చేశారు. నువ్వు ఎలా ఉండాలని అనుకున్నావో అలాగే ఉండాలని మెహ్రీన్ పేర్కొన్నారు. నీలా నువ్వు ఉన్నందుకు చింతించకని నీపై నువ్వు పూర్తి ఆధిపత్యంతో ఉండాలని మెహ్రీన్ వెల్లడించారు. ఇలా ఉండడం వల్ల సరైన వ్యక్తులు జీవితంలోకి వస్తారని అందుకే ఈ విధంగా ఆవేదనతో పోస్ట్ పెట్టానని మెహ్రీన్ అన్నారు. ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో మెహ్రీన్ నటిస్తుండగా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానని మెహ్రీన్ భావిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus