Vidaamuyarchi: ఆగిపోయిన అజిత్‌ సినిమా… ఎవరిది తప్పు.. ఎవరు భరించాలి?

రెండేళ్ల క్రితం సంక్రాంతికి రెండు సినిమాలను తీసుకొచ్చి భారీ విజయాలు అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్‌. అచ్చంగా అలా చేయాలని కాదు కానీ ఈ ఏడాది కూడా సంక్రాంతికి సినిమా తీసుకొచ్చి ఆ స్థాయి విజయం అందుకోవాలని ప్లాన్‌ చేసింది. దాని కోసం తమ తొలి తమిళ చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ని రెడీ చేసింది. అజిత్‌ నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావడం పక్కా అని మైత్రీ టీమ్‌ చెప్పింది కూడా.

Vidaamuyarchi

అయితే, అజిత్‌ (Ajith) మరో సినిమా ‘విదా మయూర్చి’ని (Vidaamuyarchi) రంగంలోకి దింపే ప్రయత్నం చేసింది లైకా ప్రొడక్షన్స్‌. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ తమ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా పొంగల్‌ రిలీజ్‌ ఆలోచనను విరమించుకుంది. తీరా మరో రెండు వారాలు ఉంది అనగా.. ‘విద మయూర్చి’ ఆగిపోయింది. సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయడం లేదు అంటూ లైకా ప్రొడక్షన్స్‌ వివిధ కారణాలు చెబుతూ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మైత్రీ వాళ్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అయిపోయింది.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని చాలా నెలల క్రితమే అనౌన్స్‌ చేశారు మైత్రీ వాళ్లు. అప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ‘విదాముయర్చి’ని గతేడది దసరా/ దీపావళి సీజన్స్‌లో వచ్చేస్తుందని అప్పట్లో వార్తలు రావడమే దానికి కారణం. అయితే అనూహ్యంగా ఆ సినిమా వాయిదాలు పడుతూ పడుతూ సంక్రాంతి వరకు వచ్చింది. అయితే ఆ వాయిదాకు కారణాల్లో అజిత్‌ షూటింగ్‌ సమయంలో గాయపడటమూ ఉంది.

అయితే, లైకా ఇలా వెనక్కి తగ్గుతుంది అని ఊహించని మైత్రీ టీమ్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ పనులను హోల్డ్‌లో పెట్టేసింది. ఇప్పుడు మరో పది రోజుల్లో సినిమాను రిలీజ్‌కి రెడీ చేయలేరు కాబట్టి సంక్రాంతికి అజిత్‌ సినిమా ఏదీ రావడం లేదు. అయితే ఇప్పుడు లైకా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే లైకా మేం ముందే వస్తాం అంటే మైత్రీ వాళ్లు ఇంకొన్నాళ్లు తమిళ ఎంట్రీ కోసం ఆగాలి. లేదంటే ముందు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’కి లైన్‌ ఇచ్చేసి లైకా వెనక్కి వెళ్లాలి.

కీర్తి సురేశ్‌ లాంగ్‌ టైమ్‌ ప్రేమ విషయం..వాళ్లకు మాత్రమే తెలుసట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus