బాలయ్యకు భయపడని నాగబాబు, వర్మ అంటే..?

మెగా బ్రదర్స్ లో పెద్ద దురదృష్టవంతుడిగా నాగబాబుని చెవుతారు. మెగాస్టార్ చిరంజీవి అండ, మెగా ఫ్యామిలీ అభిమానుల ఆదరణ ఉండి కూడా ఆయన హీరోగా ఎదగలేకపోయాడు. కనీసం అన్న ఇమేజ్ అడ్డుపెట్టుకొని నిర్మాతగానైనా కోట్లు వెనకేసుకుందాం అనుకుంటే అంజనా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రాలలో ఒకటి అరా తప్ప అన్ని అట్టర్ ప్లాప్ చిత్రాలే. హీరో చరణ్ తో ఆరంజ్ మూవీ చేసి చేతులు కాల్చుకున్న నాగబాబు, ఆ బాధల నుండి బయటపడడానికి అనేక ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఆయన జబర్దస్త్ ఎంట్రీకి కూడా ఆర్ధిక ఇబ్బందులే కారణం.

ఇక నాపేరు సూర్య సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉంది…తన సెంటిమెంట్ నిలబెట్టుకున్నాడు, నాగబాబు. ఐతే నాగబాబు మెగా ఫ్యామిలీ కాపలాదారు బాధ్యత తీసుకున్నారు. మెగా ఫ్యామిలీ పై మరియు ఆ కుటుంబ సభ్యులపై ఎవరు చెడ్డగా మాట్లాడినా వాటికి సుదీర్ఘ వీడియోల ద్వారా సమాధానాలు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. ఇక బాలయ్యపై అయితే నాగబాబు తోక తొక్కిన త్రాచులా లేస్తాడు. బాలయ్యను విమర్శించే ఏ అవకాశాన్ని నాగబాబు వదులుకోడు. ఐతే వర్మ విషయంలో మాత్రం నాగబాబు నోరు మెదపడం లేదు.

బాలయ్య పరోక్షంగా చేసిన వ్యాఖలకే ఖబడ్దార్ బాలయ్య అని హెచ్చరించిన నాగబాబు, వర్మ పవర్ స్టార్ సినిమా పేరుతో రచ్చ చేస్తున్నా పల్లెత్తి మాటనడం లేదు. ఎన్నికలలో పవన్ కి ఎదురైన ఘోర పరాభవాన్ని, దాని వలన ఆయన అనుభవించిన మానసిక వేదనను హైలెట్ చేస్తూ వర్మ పవర్ స్టార్ మూవీ చేస్తున్నారు. పవన్ వ్యక్తి గత విషయాలు కూడా గెలుకుతున్న వర్మపై నాగబాబు ఎందుకు వీడియో చేయడం లేదు. బాలయ్యకు భయపడని నాగబాబు, వర్మకు ఎందుకు భయపడుతున్నాడు?

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus