నెర్వస్ నైంటీస్ అంటుంటారు మీకు తెలుసా? క్రికెట్‌లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బ్యాటర్ 90 పరుగులు చేసి, సెంచరీ దారిలో ఉన్నప్పుడు ఔట్ అయిపోతూ ఉంటారు. సెంచరీ చేయాలనే నెర్వస్ వల్ల అంత సేపు బాగా ఆడిన బ్యాటర్ ఔట్ అయ్యారు అనేది ఆ పదం అర్థం. ఇందులో ఎక్కువగా నెర్వస్ 99 ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి నెర్వస్ 99లో ఉన్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. అవును మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు దానికి మరో నెర్వస్ కలిసి ఓ సినిమా ఆగిపోయింది అని అంటున్నారు.
నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎవరు చేస్తారు అనే విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది కూడా. నాగార్జున, అఖిల్ కాంబినేషన్‌లో మోహన్‌రాజా ఈ సినిమా తెరకెక్కిస్తారు అనే సమాచారం ‘గాడ్‌ఫాదర్’ సినిమా సమయంలో వినిపించింది. అయితే ఇప్పుడు చర్చ 99వ సినిమా మీద. చాలా రోజుల నుండి ఈ సినిమా విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాంకేతిక సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయి.
కథ విషయంలోనూ మార్పులు ఉన్నాయని టాక్. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా ఫలితం ఈ సినిమాను మార్చేస్తోంది అంటున్నారు. రీమేక్‌గా రూపొందిన ఆ సినిమా రిజల్ట్ వల్ల నాగ్ ఇప్పుడు 99వ సినిమా కోసం రీమేక్‌ను ఆశ్రయించకూడదు అని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘పొరింజు మరియం జోస్’ అనే చిత్రాన్ని నాగ్ రీమేక్ చేస్తున్నట్టు ఇదివరకే తెలిసింది. జోజూ జార్జ్ హీరోగా నటించిన ఈ సినిమా యాక్షన్ డ్రామా.
ఆ సినిమా కథ నాగార్జునకు (Nagarjuna) నచ్చడంతో రీమేక్ చేద్దామని ఫిక్స్ అయ్యాడని చెప్పారు. దీని కోసం ఓ టీమ్ చాలా రోజులుగా కూర్చుని వర్క్ చేస్తున్నారు. కథా రచయిత ప్రసన్న కుమార్ ఈ సినిమాతో దర్శకుడు అవుతారని అప్పట్లో చెప్పారు కూడా. అయితే ఆ తర్వాత నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాటల్లో స్వరం వినిపించలేదు. ఇప్పుడు ఏకంగా ఆ కథే పక్కకు వెళ్లిపోయింది అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!