కొంతమంది దర్శకులు ఉంటారు… నెలల తరబడి సినిమాలు తీస్తుంటారు. అయితే ఆ సినిమాలు ఆకట్టుకుంటే మంచిదే లేదంటే భవిష్యత్తు చెప్పలేం. ఇంకొంతమంది దర్శకులు ఉంటారు ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు ముగించారో తెలియదు. కొబ్బరికాయ కొట్టి… గుమ్మడికాయ కోసం మార్కెట్‌లోకి వెళ్లేలోగా ముగించేస్తుంటారు. అదేనండి వేగంగా ముగించేస్తుంటారు. అయితే మరీ 40 రోజులకే షూటింగ్ క్లైమాక్స్‌కి సినిమా షూటింగ్ వచ్చేస్తుందా? ఏమో ఓ సినిమా అలా వచ్చేసిందట. టైటిల్‌తో ఇటీవల ఆకట్టుకున్న సినిమాల్లో ‘శ్యామ్ సింగరాయ్’ ఒకటి.
నాని జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 24న సినిమా అనౌన్స్‌మెంట్ అయ్యింది. అయితే కరోనా – లాక్‌డౌన్ కారణంగా సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. చాలా రోజుల చర్చలు, కామెంట్లు, వాయిదాల తర్వాత డిసెంబరు 10న సినిమా ముహూర్తపు షాట్ తీశారు. అంటే మొదలై సుమారు 40 రోజులు అయ్యింది. అయితే సినిమా చిత్రీకరణ చివరి దశకొచ్చింది అనేది తాజా కబురు. అదేంటి అప్పుడేనా.. అందులోనూ కరోనా పరిస్థితుల్లో ఇంత వేగమా అని అందరూ అనుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మంది టీమ్‌తో సినిమా తీస్తున్నారు… అలాంటి సమయంలో ఎలా అనేది దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, హీరో నానినే చెప్పాలి. ఇక్కడ ఓ రూమర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైందట. మంచి రోజు చూసుకొని డిసెంబరు 10న ముహూర్తపు షాట్ తీశారని అంటున్నారు. దీనిపై అధికారికంగా స్పందించకపోయినా.. గాసిప్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!