Nithiin, Pawan Kalyan: ఇన్నాళ్లకు పవన్‌ ఫ్యాన్‌ కోరిక తీరనుందా!

పవన్‌ కల్యాణ్‌తో నటించాలని, కనీసం ఒక్క ఫ్రేమ్‌లో అయినా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ అతనే స్ఫూర్తిగా సినిమాల్లోకి వచ్చి, ఇప్పటికీ ఆరాదిస్తున్న నటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో యువ కథానాయకుడు నితిన్‌ కూడా ఉన్నాడు. పవన్‌ మీద తన ప్రేమను, అభిమానాన్ని బహిరంగంగా చాలా వేదికల మీదే వెలిబుచ్చాడు నితిన్‌. అయితే ఇప్పుడు పవన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం నితిన్‌కి వచ్చిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

పవన్‌ – నితిన్‌ సినిమా పుకార్లు రావడానికి కారణం నటుడు, దర్శకుడు సముద్రఖని ఇచ్చిన ఓ స్టేట్‌మెంటే. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల సముద్రఖని మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో త్వరలో నితిన్‌తో దర్శకునిగా ఓ సినిమా చేస్తా అని చెప్పారు. సముద్రఖని త్వరలో చేసే ప్రాజెక్ట్‌ అంటే అది ‘వినోదాయ చిత్తామ్‌’ సినిమానే. పవన్‌ కల్యాణ్‌ ఓ కీలక పాత్రలో ఈ సినిమా త్వరలో ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

అందులో ఓ యువ కథానాయకుడికీ చోటుందని చెబుతున్నారు. ఇప్పుడు సముద్రఖని నితిన్‌తో సినిమా అనేసరికి అది ‘వినోదాయ చిత్తామ్‌’ సినిమా రీమేకే అని అంటున్నారు. అయితే తొలుత ఈ పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తాడని వార్తలొచ్చాయి. అంతా ఓకే అయిపోయింది, త్వరలో సినిమా ప్రారంభం అని కూడా అన్నారు. అయితే ఈలోపు పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యం బారిన పడటంతో సినిమాలన్నీ ఆగిపోయాయి. మరోవైపు టాలీవుడ్‌ నిర్మాతల బంద్‌ కూడా సినిమా ఆలస్యానికి కారణం. దీంతో సినిమాలు స్టార్ట్‌ అయితే కానీ సముద్రఖని చెప్పిన సినిమా ఏంటి అనేది తెలియదు.

ఒకవేళ సముద్రఖని చెప్పిన సినిమా ‘వినోదాయ చిత్తామ్‌’ రీమేక్‌ అయితే నితిన్‌ పంట పండినట్లే. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావన లేకుండా నితిన్‌ సినిమా ఉండదు. ఆయనను అంతగా ఆరాధిస్తుంటాడు నితిన్‌. అలాంటిది ఇద్దరూ ఒకే సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా నుండి సాయిధరమ్‌ తేజ్‌ ఎందుకు తప్పుకున్నాడో తెలియాల్సి ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus