సినిమా ఎక్కడ చూసినా సినిమానే.. అయితే మల్టీప్లెక్స్‌లో చూస్తే కాస్త కిక్ ఉంటుంది అంటుంటారు కొందరు. మాస్ జనాల మధ్యలో కూర్చుని సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు అంటుంటారు ఇంకొందరు. సీజన్ బట్టి, సినిమా బట్టి థియేటర్‌ను ఎంచుకుంటుంటారు ఇంకొందరు. అయితే పై ముగ్గురిలో రెండో వర్గానికి చెందిన వారికి అందులోనూ హైదరాబాద్‌లో ఉన్న అలాంటి వారికి బ్యాడ్ న్యూస్. నగరంలోని పేరు మోసిన సింగిల్ థియేటర్ల సంఖ్య మరింత పడిపోనుంది.
నగరంలో ఒకప్పుడు ఏ మూల చూసినా ఓ సినిమా థియేటర్ ఉండేది. థియేటర్ల ముందు చిన్న చిన్న దుకాణాలు కనిపించేవి. అయితే రాను రాను పరిస్థితి మారిపోయింది. సింగిల్ థియేటర్లు నడపడంలో సమస్యలో లేక ఇంకేంటో కానీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. పేరు మోసిన థియేటర్లు సైతం మూసేసి, వాటి స్థానంలో మల్టీప్లెక్స్‌లు తీసుకొస్తున్నారు. లేదంటే వాటిని మల్టీప్లెక్స్‌లుగా కన్వర్ట్ చేస్తున్నారు. అలా హైదరాబాద్‌లో ఎన్నెన్ని థియేటర్లు మారాయో మీరు కూడా చూసి ఉంటారు.
నగరంలో ప్రారంభంలోని ఎల్‌బీ నగర్‌లో ఉన్న విజయలక్ష్మీ థియేటర్ కాస్త కొన్నేళ్ల క్రితం బీవీకే మల్టీప్లెక్స్‌గా మారిపోయింది. అంటే ఇలాంటి ప్రాంతంలో కూడా మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయనుకోవచ్చు. అలాగే నగరంలో చివరన రామచంద్రాపురం, చందానగర్ లాంటి ప్రాంతాల్లో థియేటర్లను మిరాజ్, ఏసియన్ లాంటివాళ్లు తీసుకొని మల్టీప్లెక్స్‌గా మార్చేశారు. దీంతో ఆయా థియేటర్లలో సినిమా చూడటం భారంగా మారింది. కారణం అక్కడ చిన్న సినిమాకు కూడా రూ. 200 ప్లస్ ట్యాక్స్‌లు కట్టాల్సి రావడమే.
తాజా సమాచారం ప్రకారం 2023 సంక్రాంతికి సిటీలో 20 అదనపు స్క్రీన్లు రెడీ చేస్తున్నారట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒడియన్ కాంప్లెక్స్ లో తొమ్మిది స్క్రీన్లతో మల్టీప్లెక్స్ సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో అన్ని సింగిల్ థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఒకే థియేటర్ స్థానంలో అన్ని స్క్రీన్లు వస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో 11 స్క్రీన్లతో మరో మల్టీప్లెక్స్ రాబోతోంది. ఇన్ని స్క్రీన్లు నగరంలో ఇదే తొలిసారి అంటున్నారు.
ప్రసాద్ ఐమ్యాక్స్‌లో బిగ్ స్క్రీన్‌ను తొలగించాక… మళ్లీ ఏర్పాటు చేయమనే డిమాండ్ ఉంది. కానీ కుదరడం లేదు. అయితే పంజాగుట్టలోని పీవీఆర్ సెంట్రల్‌లో రెండు స్క్రీన్లు కలిపేసి అతి పెద్ద ఐమ్యాక్స్ ఒరిజినల్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారట. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది తెలియాలి. అమీర్ పేట సత్యం థియేటర్‌లో AAA మల్టీప్లెక్స్ చేస్తున్నారు. త్వరలోనే దీని ప్రారంభం ఉండొచ్చు. ఇలా మరికొన్ని పెద్ద సింగిల్ థియేటర్స్ మల్టీప్లెక్స్‌లు అవుతాయి. ఇదంతా చూస్తుంటే సింగిల్ థియేటర్లకు కాలం దగ్గరపడుతుందనే చెప్పొచ్చు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!