MAA Elections: ‘మా’లో ఇన్నాళ్లూ ఇదెందుకు సాధ్యం కావడం లేదు!

  • June 25, 2021 / 03:08 PM IST

టాలీవుడ్‌లో ఏడాదికి నిర్మించే సినిమాలు ఎక్కువ, హీరోల రెమ్యూనరేషన్లు ఎక్కువ, హీరోల రెమ్యూనరేషన్ల విషయంలోనూ అంతే. అంత పెద్దది మరి టాలీవుడ్‌. ఈ క్రమంలో వీళ్లంతా కలిపి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అని ఓ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. దాని కోసం హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో చిన్న భవనంలో కార్యాలయం ఉంది. అంత పెద్ద సంఘానికి సొంత భవనం లేదా అంటే… లేదు అనే చెప్పాలి. కారణం చెప్పాలి అంటే… కేవలం ‘మా’ ఎన్నికలప్పుడు మాత్రమే ఈ విషయం గుర్తుకు రావడం.

‘మా’లో ప్రతి రెండేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. తొలుత ఏకగ్రీవం అయినా, గత రెండు పర్యాయాలుగా ఎన్నికలు అవసరం అవుతున్నాయి. అయితే ఎన్నికలు మారినా, అభ్యర్థులు మారినా… వాళ్లు ఇచ్చే హామీల్లో ‘మా ’కు సొంత భవనం కామన్‌గా ఉంటూ వస్తోంది. ఇన్నేళ్లు అవుతున్నా చిరంజీవి, మోహ‌న్ బాబు, ముర‌ళీ మోహ‌న్, నాగ‌బాబు, నాగార్జున లాంటి వాళ్లు మా అధ్యక్షులుగా పని చేసినా… భవనం కల సాకారం అవ్వలేదు.

దేశంలో అందరూ చూసి గర్వించదగ్గ భవనం నిర్మిస్తామని ప్రతిసారి చెబుతూ వచ్చారు. అయినా ఇంతవరకు అవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల హామీలోనూ ఇదే ‘హామీ’ వినిపిస్తోంది. ఈసారి అవుతుందా? లేదా ? అనేది కాసేపు పక్కనపెడితే ఇన్నాళ్లూ ఎందుకు అవ్వడం లేదు. ‘మా’ దగ్గర డబ్బులు లేవా? అంటే ఉన్నాయనే చెప్పాలి. ప్రభుత్వంతో ‘మా’ పెద్దలకు సత్సంబంధాలు లేవా? అంటే ఉన్నాయనే చెప్పాలి. కానీ ఎందుకు అవ్వడం లేదు.

ఇప్పటికిప్పుడు ‘మా ’ భవనం కట్టాలంటే డబ్బులు అనేది పెద్ద మేటర్‌ కాదు. పారితోషికంగా కోట్ల రూపాయలు తీసుకుంటున్న మన స్టార్‌ హీరోలు, హీరోయిన్లు కాస్త ఇటు ఇచ్చినా బంగారం లాంటి భవనం సిద్ధమైపోతుంది. అయితే మన స్టార్‌ హీరోయిన్లలో చాలామంది ‘మా’లో సభ్యత్వం లేదు. కాబట్టి వాళ్లను పక్కనపెడదాం. ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న హీరోలు తలో కోటి ఇచ్చినా చాలు. కానీ ఇక్కడ సమస్య చేయాలనే ఆలోచన. రెండోది స్థలం.

పోలీ ఈసారి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తినే గెలిచారు అనుకుందాం. ఇక సమస్య రెండోది. ఇది ఇంత త్వరగా ఈ సమస్య తేలేలా కనిపించడం లేదు. కారణం ఫిల్మ్‌ ఛాంబర్‌కు దగ్గర్లోనే ‘మా’ భవనానికి స్థలం కావాలని కోరుతుండటమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు జూబ్లీహిల్స్‌ – ఫిల్మ్‌నగర్‌ పరిసరాల్లో అంత స్థలం ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయల పైమాటే.

ఇంత భారీ ‘మొత్తం’ స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రాదు. కాబట్టి వేరే ఏదైనా స్థలం తీసుకొని అందులో భవనం నిర్మించుకోవాలి. దానికి అందరూ ఓకే అనుకుంటే ఈసారి ‘మా’ భవనం వస్తుంది. లేదంటే రెండేళ్ల తర్వాత జరిగే వచ్చే పర్యాయం ఎన్నికల్లో మళ్లీ ‘హామీ’గా ‘మా’ సభ్యుల ముందుకు వస్తుంది. కాబట్టి ‘మా’ పెద్దలు అందరూ ఎన్నికలు అయ్యాక ఈ స్థలం విషయం తేల్చేస్తే ఓ పనైపోతుంది. అప్పుడు కొత్త హామీ వెతుక్కోవచ్చు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus