Pawan Kalyan: అసలు విషయం తెలియక నానా రచ్చ అవుతోందిగా!

‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీ షెడ్యూల్‌ వర్క్‌షాప్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల బయటకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత పవన్‌ బయటకు రావడం, లుక్‌ కూడా మాసీగా అదిరిపోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే ట్రోలర్స్‌కి కూడా పవన్‌ మంచి స్టఫ్‌ ఇచ్చాడు అని చెప్పాలి. అదే పవన్‌ ధరించిన బూట్లు, చేతికి పెట్టుకున్న వాచీ. వాటి ధర లక్షల్లో ఉందంటూ.. నెటిజన్లు పవన్ కల్యాణ్‌ను ట్రోల్‌ చేశారు. అయితే అసలు లెక్క ఇదీ అంటూ.. పవన్‌ ఫ్యాన్స్‌ లెక్కలు చెప్పారు. ఇంతకీ ఏమైందంటే?

పవన్‌ కల్యాణ్‌ పెట్టుకున్న వాచీ, వేసుకున్న బూట్ల సంగతి చూద్దాం అంటూ.. కొంతమంది నెటిజన్లు ఆన్‌లైన్‌లో వెతికారట. ఆయన వేసుకున్న రెడ్ టీ షర్ట్‌ ధర రూ. 14 లక్షలు, బ్రౌన్‌ అండ్‌ బ్లాక్‌ కలర్‌ షూ ధర రూ. 10 లక్షలు అని లెక్కలు కనిపించాయట. నిజానికి వాటి ధర అంత కాదు అని అభిమానులు తర్వాత లెక్క తేల్చారు. ఆ షూ ధర 119 యూరోలు అంట. అయితే ఆ వెబ్‌సైట్‌లో 119,94 అని ఉండటం చూసి 11,994 అని అనుకున్నారు కొంతమంది.

కానీ యూరోల్లో లెక్కేసినప్పుడు డాట్‌ని కామాగా రాస్తారు అనే విషయం పట్టించుకోలేదు. ఆ లెక్కన పవన్ షూ ధర రూ. 9,600 అట. వాచీ కూడా ఇలాగే తక్కువ రేటు ఉంటుంది అంటున్నారు. అయితే యూరోలు టు రూపాయలు లెక్క చూసుకోకుండా.. కామాలు, డాట్‌ సంగతి తెలియకుండదా ట్రోలర్స్‌ అలా అంటున్నారు అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం అదంతా నిజం కాదని, పవన్‌ లక్షల రూపాయాల వస్తువులు ధరించారని కామెంట్స్‌ చేస్తున్నారు. హీరోలు నిజానికి కాస్ట్లీ వస్తువులు వాడతారు. అయితే లెక్కలు చూసుకోకుండా తక్కువ రేటువి కాస్ట్‌లీ అంటే బాగోదు. ట్రోలర్స్‌ ఏం చేస్తారో చూడాలి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus