Priyanka Chopra, Jonas: వైరల్‌గా మారిన సోషల్‌ మీడియా పేర్ల మార్పు

సోషల్‌ మీడియాలో పేరు మార్చుకుంటే… ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీస్తోంది. మొన్నీమధ్యే టాలీవుడ్‌లో నాగచైతన్య- సమంత బ్రేకప్‌ ఇలానే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జంట విషయంలో ఇదే జరగబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ – హాలీవుడ్‌ వర్గాలు. ఇదంతా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా – నిక్‌ జొనాస్‌ గురించే. ఎందుకంటే… ప్రియాంక సోషల్‌ మీడియా అకౌంట్‌లో పేరు చివర ఉన్న భర్త పేరు జొనాస్‌ తొలగించేసింది. ఆ మధ్య ఎప్పుడో బాలీవుడ్‌ అక్టోపస్‌ కమల్‌ ఆర్.ఖాన్ మాట్లాడుతూ… నిక్యాంక (నిక్‌ జొనాస్‌ – ప్రియాంక) త్వరలోనే విడిపోతారని చెప్పుకొచ్చాడు.

అయితే దీనిపై నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం అంటున్నాయి పరిస్థితులు. గత కొన్ని రోజులుగా నిక్యాంక పబ్లిక్‌ అప్పీయరెన్స్‌ లేదు. మరోవైపు సోషల్‌ మీడియాలో ప్రియాంక… చివర జొనాస్‌ ఎగిరిపోయింది. చైసామ్‌ విషయంలో జరిగిందే ఇక్కడా జరుగుతోందనేది పరిశీలకుల అంచనా. అయితే ఈ వార్తలపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించారు. ప్రియాంక – జొనాస్‌ విడిపోతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. పుకార్లను వ్యాప్తి చేయొద్దు, నమ్మొద్దు అని కూడా చెప్పారు. ఈ వార్తలపై ప్రియాంక స్నేహితురాలు కూడా స్పందించారు.

అవన్నీ పుకార్లు మాత్రమే అని తేల్చేశారు. ప్రియాంక భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌ల కోసమే పేరును ఇలా మార్చుకుందని అంటున్నారు. అయితే సమంత – నాగచైతన్య విషయంలోనూ ఇదే జరిగిన విషయం తెలిసిందే. సో జనాలు డౌట్‌ పడటం సహజమే. ప్రియాంక, అమెరికా పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ ఒక టీవీ షోలో కలిసి కనిపించారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ… పెళ్లిగా మారింది. 2018లో ఇరుకుటుంబాల సమక్షంలో రాజస్థాన్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. దీపావళి వేడుకల్లో జొనాస్‌తో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. దీనిపై నిక్యాంక క్లారిటీ ఇస్తే బాగుండు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus