Puri Jagannadh: తమ్ముడు వద్దనుకున్నవి హిట్‌… అన్నకీ ఈ సెంటిమెంట్‌ వర్తిస్తుందా?

  • May 1, 2021 / 06:33 PM IST

రవితేజ్ తొలినాళ్లలో హిట్‌ కొట్టిన సినిమాలు మీకు గుర్తున్నాయా? ఎందుకు లేవు వరుసగా చాలా హిట్లే కొట్టాడు కదా అని ఓ లిస్ట్‌ చెప్పొచ్చు. ఆ లిస్ట్‌లో నిశితంగా చూస్తే ఒక పాయింట్ మీకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలు కెరీర్‌ను ఓ మలుపు తిప్పాయి. ప్రస్తుతమున్న ఇమేజ్‌ ఈ సినిమాలతో వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. వీటిలో కామన్‌ పాయింట్‌ ఏంటంటే.. ఇవన్నీ పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసినవే. ఇంకొకటి కూడా ఉంది. ఈ సినిమాలన్నీ వేరే హీరో వద్దనుకున్నవే. లేదంటే వేరే హీరోను అనుకొని రాసి రవితేజ రాసినవే.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్‌’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాల గురించి మాట్లాడినప్పుడు ఠక్కున ఇవన్నీ పవన్‌ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని పూరి జగన్నాథ్‌ రాశాడని మనకు గుర్తొస్తుంది. ఇక్కడ మేం చెబుతున్న పాయింట్ కూడా అదే. పవన్‌ కోసం అనుకున్న కథలు రవితేజకు మంచి విజయం అందించాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ చిరంజీవి విషయంలో కూడా వర్కౌట్‌ అవుతుందా? ఎందుకంటే చిరంజీవి కోసం పూరి రాసుకున్న ‘ఆటో జానీ’ కథను రవితేజకు ఇచ్చేస్తున్నాడని టాక్‌ వస్తోంది కాబట్టి.

చిరంజీవి రీఎంట్ర కోసం పూరి జగన్నాథ్‌ ‘ఆటో జానీ’ కథ రాసుకున్నాడు. అయితే సెకండాఫ్‌ విషయంలో చిరంజీవి అంతగా ఆసక్తిగా లేకపోవడంతో సినిమా ఆగిపోయింది. మళ్లీ ఇదే కథను ఆయనకు నచ్చేలా సిద్ధం చేసి ఎలాగైనా సినిమా చేస్తా అని పూరి చాలాసార్లు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ మాట తప్పి, కథను రవితేజకు ఇస్తున్నాడట. కథలో చిన్నపాటి మార్పులు చేస్తే రవితేజకు సరిపోతుందనేది ఆలోచనట. ఇద్దరి కాంబోకు ఉన్న క్రేజీ చిరంజీవి కథ, మెగా కుటుంబం టు రవితేజ సెంటిమెంట్‌ ఓకే అయితే సినిమా హిట్టే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus