మూడు వెబ్‌సిరీస్‌లపై పుకార్లు.. రియాక్ట్‌ అయిన రాజ్‌ అండ్‌ డీకే

ఇండియన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరగడంలో రాజ్‌ అండ్‌ డీకే (Raj & DK) వెబ్‌సిరీస్‌లు ప్రభావం చాలా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 1’, ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’, ‘ఫర్జీ’, ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’ లాంటి సిరీస్‌లు ఈ దర్శకద్వయం నుండి వచ్చాయి. అలాంటి ఈ ఇద్దరి నుండి రానున్న రెండు సిరీస్‌లు ఆగిపోతాయి అంటూ ఓ పుకారు రీసెంట్‌గా మొదలైంది. దీనిపై వాళ్ల నుండి క్లారిటీ వచ్చింది.

Raj & DK

తమ కొత్త వెబ్‌సిరీస్‌ల విషయంలో వస్తున్న పుకార్ల విషయంలో రాజ్‌, డీకే (Raj & DK) పరోక్షంగా స్పందించారు. సెట్స్‌లో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ పని తాము గొప్పగా చేసుకుంటూ వెళ్తున్నామని ఆ ఫొటోలతోపాటు రాసుకొచ్చారు. అంటే మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు అనొచ్చు. రాజ్‌, డీకే, అనిల్‌ బార్వే కలిసి చేస్తున్న ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ సిరీస్‌ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, ఆ సిరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రూ.3 కోట్లు దొంగిలించారని, స్క్రిప్టు పరంగానూ ఇబ్బందులు ఉన్నాయని వార్తలొస్తున్నాయి.

కథలో మరికొందరు ఇన్వాల్వ్‌ కావడం కూడా నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌కి నచ్చక క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయని కూడా పుకార్ల సారాంశం. మరోవైపు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం చేస్తున్న ‘గుల్కందా టేల్స్‌’ సిరీస్‌ కూడా ఆగిపోనుందనే ప్రచారం మొదలైంది. దానికి కూడా ఇలాంటి కారణాలే ఏవో చెప్పుకొచ్చారు. ఆ పుకార్ల మీదే ఇప్పుడు రాజ్‌, డీకే (Raj & DK)  రియాక్ట్‌ అయ్యారు.

దీంతో ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 3’ తప్పక వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అవన్నీ ఆగితే ఇది కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలా క్లారిటీ రావడంతో రాజ్‌ డీకే ఫ్యాన్స్‌.. సమంత ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే సమంత ఈ వెబ్‌సిరీస్‌ల ద్వారా గత కొన్ని ఏళ్లుగా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ED టార్గెట్‌లో శంకర్.. 11 కోట్లు ఎందుకు అటాచ్ చేశారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus