మహేష్‌ సినిమా కోసం జక్కన్న అతని సాయం తీసుకుంటున్నారా?

  • January 28, 2023 / 07:20 PM IST

మహేష్‌బాబు కొత్తగా చూపించాలి.. ప్రతి దర్శకుడు ఇదే మాట అనుకుంటూ సినిమా మొదలుపెడతారు. ఎందుకంటే మహేష్‌బాబు చాలా షేడ్స్‌ ఉన్నాయి. వాటిని ఎంతబాగా రాసుకుంటే, తీర్చిదిద్దితే సినిమా అంత భారీ విజయం సాధిస్తుంది. గతంలో సినిమాలు చేసిన దర్శకులు చాలామంది ఇదే పని చేశారు. మహేష్‌లోని కొత్త కొత్త స్టైల్స్‌ బయటకు తీసి వావ్‌ అనిపించారు. అయితే రాజమౌళి మాత్రం కొత్త స్టైల్‌ కాకుండా.. పాత స్టైల్‌నే ఎంచుకుంటున్నారట. అంతే కాదు దీని కోసం సుకుమార్‌ స్టైల్‌ను ఫాలో అవుతారని టాక్‌.

మహేష్‌బాబుతో ఇండియానా జోన్స్‌ తరహాలో ఓ సినిమా రూపొందిస్తామని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం కథ పనులు చూస్తున్నారు. త్వరలోనే కథను లాక్‌ చేస్తారని సమాచారం. ఈ క్రమంలో సినిమా కథ అది, ఇది అంటూ చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సినిమాలో మహేష్‌బాబు లుక్స్‌ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. మహేష్‌ లుక్స్‌లో ‘వన్‌ నేనొక్కడినే’ లుక్స్‌ అదిరిపోతాయి. కానీ ఆ సినిమా ఫలితం ఆశించినట్లుగా రాలేదు.

‘వన్‌’ సినిమాలో మహేష్‌ లుక్స్‌, స్టైల్‌ అంటే రాజమౌళి కూడా చాలా ఇష్టం. గతంలో సుకుమార్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు రాజమౌళి ఇదే విషయం ప్రస్తావనకు తెచ్చారు కూడా. ఇప్పుడు అదే లుక్స్‌ను తన సినిమాలో వాడుకుందాం అని రాజమౌళి అనుకుంటున్నారట. ‘వన్‌’ సినిమా హాలీవుడ్‌ స్టైల్‌ మేకింగ్‌, స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించింది. అయితే కీలక సమయాల్లో సినిమా పట్టుతప్పి తేడా కొట్టింది. అందుకే రాజమౌళి తన వైవిధ్యమైన కథకు సుకుమార్‌ స్టైల్‌ యాడ్‌ చేస్తాను అని అంటున్నారట.

మహేష్‌ను మళ్లీ ‘వన్‌’ లుక్‌లో చూపిస్తారు అంటే ఫ్యాన్స్‌ హ్యాపీ అనే చెప్పాలి. అయితే కథ, కథనం, పట్టు విషయంలో రాజమౌళి తన విధానాన్ని మార్చకుంటే ఉంటే సరి.. బ్లాక్‌బస్టర్‌ ఆటోమేటిక్‌గా వస్తుంది అంటున్నారు. అయితే ‘ఆర్ఆర్‌ఆర్‌’ విషయంలో వచ్చిన ‘ఎమోషన్స్‌ లేవు’ అనే విమర్శలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus