బాలీవుడ్‌లో క్యూట్ బాయ్‌గా పేరున్న కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) జంట గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక రొమాంటిక్ డ్రామాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన కెమిస్ట్రీ ప్రస్తుతం గాసిప్ రూమ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు వైరల్ కాగా, కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ కూడా ఈ రూమర్స్‌కు హెల్ప్ అయ్యాయి.
“మాకు కోడలిగా మంచి డాక్టర్ కావాలి” అని ఆమె చెప్పడంతో, ఫ్యాన్స్ దీన్ని శ్రీలీలకు లింక్ చేశారు. అంతేకాదు, శ్రీలీల ఇటీవల ఇన్‌స్టాలో ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు.. ఈ రూమర్లకు మరింత వేడి తెచ్చాయి. అయితే ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని స్పష్టం చేసిన కార్తీక్.. “నాకే గర్ల్ ఫ్రెండ్ ఉందంటారా? ఈ ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ లేరా?” అంటూ ప్రశ్నించారు.
అంతేకాదు, తనకు సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని, అందుకే తన మీద ఎక్కువ రూమర్స్ వస్తాయని, ఎవరికైనా నచ్చకపోతే ఇలా చేస్తారని అన్నారు. రెమ్యూనరేషన్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. తాను ఒక్కడినే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడు కాదని అన్నారు. ఇక ఈ కామెంట్స్‌లో ఎక్కడా శ్రీలీల పేరు లేకపోయినా.. “ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదు” అనే లైన్‌తో నెటిజన్లలో కన్‌ఫ్యూజన్ మొదలైంది.
నిజంగా కార్తీక్ ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నారా? లేక పబ్లిసిటీకి భాగంగా ఇలా చెబుతున్నారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో శ్రీలీల మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా శ్రీలీల-కార్తీక్ జోడీ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో వీరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ జంట నిజంగానే రిలేషన్‌లో ఉంటే, ఒక క్రేజీ కపుల్‌గా మారిపోవడం ఖాయం.