సల్మాన్‌ ఖాన్‌ సినిమా లేట్‌.. ఈ తెలుగు యువ హీరోకి కలిసొస్తుందా?

టాలీవుడ్‌లో ఇటు ఓ హీరో అభిమానులు, అటు ఆ హీరోకి చెందిన బ్యానర్‌ చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఎట్టకేలకు కుదురుతుందా? ఏమో వైబ్స్‌ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఆ కాంబోనే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ (Ram) – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram). ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తే చూడాలని చాలా ఏళ్లుగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అలాగే స్రవంతి రవికిషోర్‌ (Sravanthi Ravi Kishore) కూడా ప్లాన్‌ చేస్తున్నారు. బహిరంగ వేదికల మీదే ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కూడా.

Ram

వేరే హీరో – దర్శకుల కాంబినేషన్‌లు కుదరడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడిన దృష్ట్యా ఈ లాంగ్‌ వెయిటింగ్‌ కాంబో కుదిరేలా ఉంది అని చెబుతున్నారు. నిజానికి ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) – త్రివిక్రమ్‌ కలసి పని చేయాల్సి ఉంది. ఆ సినిమా ప్రిపరేషన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కూడా. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఇప్పట్లో ప్రారంభమవ్వదు అని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. అదే జరిగితే త్రివిక్రమ్‌ వేరే చిన్న సినిమా చేసే టైమ్‌ దొరుకుతుందట.

గతంలో త్రివిక్రమ్‌ ఇలా పెద్ద సినిమా కథ పనులు పూర్తి కాకపోతే ఈ లోపు చిన్న సినిమాలు చేసి ఉన్నారు. అలా వచ్చినవాటిలో ‘అఆ’ (A AA) ఒకటి. మంచి విజయం కూడా అందుకుందా సినిమా. అలా రామ్‌తో ఆయన ఓ సినిమా చేయొచ్చు అని చెబుతున్నారు. మరి బన్నీ ఈ లోపు ఏం చేస్తాడు అనేగా మీ ప్రశ్న. సమస్య అక్కడే వచ్చింది.

అల్లు అర్జున్‌ – అట్లీ (Atlee Kumar) కలసి ఓ సినిమా పెండింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అది ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉందట. అట్లీ – సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) సినిమా అన్నారు కదా.. ఇప్పుడు ఇదేంటి అనే డౌట్‌ రావొచ్చు. ఆ సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతుందట. అందుకే అట్లీ తిరిగి సౌత్‌ వస్తున్నాడట. అయితే ఇవన్నీ ‘అట’ వార్తలే.. క్లారిటీలు రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus