Ram Charan, Shankar: శంకర్‌ సినిమా కోసం రిస్కీ ఫీట్‌ చేస్తున్న రామ్‌చరణ్‌!

టాలీవుడ్‌ హీరోలు ట్రిపుల్‌ రోల్స్‌ చేయడంపై ఓ సెంటిమెంట్‌ ఉంది. అదే అలాంటి సినిమాలు విజయం సాధించడం అంత తేలిక కాదు అని. గతంలో చాలామంది స్టార్‌ హీరోలు ఇలాంటి ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు అలాంటి రిస్కీ ఫీట్‌ రామ్‌చరణ్‌ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. చరిత్రలో చరణ్‌ భాగం అయిపోతాడా? లేక చరిత్ర కొత్తగా రాస్తాడా అనే చర్చ జరుగుతోంది. రామ్‌చరణ్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

దిల్ రాజు బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మక 50వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతోంది. అందుకే వచ్చే సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమాను దిల్‌ రాజు పక్కకు తప్పించారు. అయితే సినిమాలోని చరణ్‌ పాత్రల వైవిధ్యం వల్లే సినిమా ఆలస్యం అవుతోందని టాక్‌. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారట. ఒకటి తండ్రి పాత్ర కాగా, మిగిలిన రెండు పాత్రలు సోదరులు అట.

ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ. చరణ్‌ సినిమా షూట్‌ నుండి వస్తున్న లీక్‌ల ప్రకారం ఈ ట్రిపుల్‌ రోల్‌ అంచనా వేస్తున్నారు నెటిజన్లు. అన్నదమ్ముల పాత్రల్లో ఒకటి నెగిటివ్‌ రోల్‌ అని కూడా టాక్‌. అయితే ఆ నెగిటివ్‌ పాత్ర ఆఖరులో పాజిటివ్‌ అయిపోతుందని టాక్‌. మరి టాలీవుడ్‌లో అంతగా అచ్చిరాని ట్రిపుల్‌ రోల్‌ ఎంతవరకు చరణ్‌కు కలిసొస్తుందనేదే ఇక్కడ చర్చ. చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’లో ట్రిపుల్‌ రోల్‌ చేశారు.

సినిమా ఫలితం ఫర్వాలేదనిపించింది. ఇక ఎన్టీఆర్ ‘జైలవకుశ’ చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం అందివ్వలేదు. సూపర్‌ స్టార్‌ కృష్ణ ‘రక్తసంబంధం’ కూడా చేదు ఫలితాన్నే ఇచ్చింది. దీంతో చరణ్‌ చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తండ్రికి సాధ్యం కాని ‘ట్రిపుల్‌’ బ్లాక్‌ బస్టర్‌ చేసి చూపించాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus