నటసింహ బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న “ఎన్టీఆర్” బయోపిక్ మొదటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ అటు సినిమారంగంలోను, ఇటు రాజకీయరంగంలోనూ విజయకేతనం ఎగురవేశారు. అందుకే అతని బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంలో చూపించనున్నారు. ఇందుకు మహానాయకుడు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లోకి రానుంది. ఈ రెండు సినిమాలకు పోటీగా మరో సినిమాని రామ్ గోపాల వర్మ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ లైఫ్‌లో సినిమా, రాజకీయాలు తర్వాత ఆసక్తికరమైన అంశం లక్ష్మీపార్వతి. అదే పాయింట్ తో సినిమా ప్రకటన చేసి అందరూ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు.
అయినా క్రిష్ కంగారు పడడం లేదు. సైలెంట్ గా ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. మొదట ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలయ్య పోస్టర్లను విడుదలన చేసిన క్రిష్..ఆ తర్వాత చంద్రబాబు పాత్రలో రానా స్టిల్‌ని.. ఎన్టీఆర్ అల్లుడు పుంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్రలో నటిస్తున్న భరత్ స్టిల్‌ని .. వరుసగా ఒక్కొక్కరి స్టైల్ ని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఇతర పాత్రలకు సంబంధించిన ఒక్కో స్టిల్స్‌ని కూడా క్రిష్ దగ్గరుండి డిజైన్ చేయిస్తున్నారు. వాటిని కూడా ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు. ఇలా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇవ్వనున్నారు. వివాదాలకు పోకుండా విజయాన్ని అందుకోవడానికి మంచి స్కెచ్ వేశారని క్రిష్ ని సినీ విశ్లేషకులు అభినందిస్తున్నారు.