ఆస్కార్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తో భళ్లాలదేవుడు.. రానా.. ఎందుకని?

  • March 4, 2023 / 07:09 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట త్వరలో ఆస్కార్‌ వేదిక మీద లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌ జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ పాట సింగర్స్‌ కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆస్కార్‌ వేదిక మీద ఈ పాటను ఆలపించబోతున్నారు. అయితే ఆ సమయంలో హీరోల లైవ్‌ ప్రదర్శన కూడా ఉంటుందా? అనే చిన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదనుకోండి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ పాట పాడే సమయంలో రామ్‌, భీమ్‌తోపాటు భళ్లాలదేవుడు కూడా అక్కడే ఉంటాడని సమాచారం.

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా… ఇతర దేశాల అభిమానుల ప్రేమను కూడా పొందింది. పెద్ద పెద్ద విదేశీ సెలబ్రిటీల కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. స్టీఫెన్‌ స్పీల్‌ బర్గ్‌, జేమ్స్‌ కామెరూన్‌ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. ఆ విషయాలు పక్కనపెడితే… సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ఉత్తమ గీతం కేటగిరీలో ఆస్కార్‌కి ఎంపికైంది. మార్చి 12న ఈ ఈ వెంట్ జరగబోతోంది. అంటే మనకు మార్చి 13న ఉదయం అన్నమాట.

ఆ సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తోపాటు రానా కూడా ఉంటాడు అని అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యాక్టర్స్‌కి, దర్శకుడుకి, ఆయన కుటుంబానికి రానా బాగా క్లోజ్‌. ఈ కారణంతోనే రానా కూడా ఆ ఆనందంలో లైవ్‌గా పార్టిసిపేట్‌ చేయాలని అనుకుంటున్నాడట. ‘నాటు నాటు’ పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వరిస్తుందని, తనకు ఆ నమ్మకం ఉందని అన్నాడ రానా. ఆ సమయంలో వారితోపాటు ఉండి ఆ ఆనందాన్ని షేర్‌ చేసుకోవడానికి తాను కూడా ఉంటే బాగుంటుంది అని రానా చెప్పాడని టాక్‌.

అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే అవార్డుల వేడుకలకు కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఈ నెల ఐదో తేదీన ఈ ఈవెంట్‌ కోసం తారక్‌ అమెరికా బయలుదేరుతాడని సమాచారం. ఇప్పటికే రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి, కార్తికేయ, సెంథిల్‌ అక్కడే ఉన్న విషయం తెలిసిందే. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా త్వరలోనే అక్కడకు చేరుకుంటారని టాక్‌. ఇంకా ఎవరెవరు వెళ్తారో చూడాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus