అదే కథ అయితే.. మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

ఇటీవల ‘డిస్కో రాజా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మన మాస్ మహా రాజ రవితేజ. వి ఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం గత వారం విడుదలయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. ఇక మొదటి వారం కలెక్షన్లు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి కాబట్టి… ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం లేదనే చెప్పాలి. దీంతో రవితేజ ఆశలన్నీ తన తరువాతి సినిమా ‘క్రాక్’ పైనే..! గోపిచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 8న విడుదల కాబోతుంది.

అయితే ఈ చిత్రం ఓ తమిళ హిట్ చిత్రానికి కాపీ అని ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే తమిళంలో క్రేజీ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘సేతుపతి’ చిత్రం అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాదాపు ఆ చిత్రం స్టోరీ లైన్ నే ‘క్రాక్’ గా తీస్తున్నారని టాక్. నిజానికి ‘సేతుపతి’ చిత్రాన్ని ‘జయదేవ్’ పేరుతో తెలుగులోకి ఎప్పుడో రీమేక్ చేశారు. గంటా శ్రీనివాసరావు కొడుకైన గంటా రవి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇక్కడ ప్లాప్ అయ్యింది. అయితే ఇదే కాన్సెప్ట్ ని రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus