Revanth: రేవంత్ పొరపాటు చేశాడా ? ఫైమాకి ఫేవర్ చేశాడా..? తెరవెనుక ఏం జరిగిందంటే.?

10 వ వారం కెప్టెన్సీ టాస్క్ లో రోహిత్ ఇంకా రేవంత్ ల మద్య పెద్ద మాట యుద్ధం జరిగింది. ముఖ్యంగా రోహిత్ చాలా ఫ్రస్టేట్ అయిపోతూ రెచ్చిపోయాడు. నిజానికి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు రోహిత్ – మెరీనా ఇద్దరూ తిరిగేటపుడు రోహిత్ మెరీనావైపు రాలేదు. భార్య కాబట్టి ఎటాక్ చేయలేదు. అంతేకాదు, మెరీనా అవుట్ అవ్వగానే ఫైమాని టార్గెట్ చేశాడు. రోహిత్ , ఫైమా, శ్రీసత్య ఇంకా ఆదిరెడ్డి నలుగురు తిరిగేటపుడు బిగ్ బాస్ సంచిలని చేతులతో పట్టుకోవడానికి వీల్లేదని చెప్పాడు. ఇక్కడే రేవంత్ ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు.

మరి నేను మద్యలో రూల్ చెప్తే కాదన్నారు కదా, మరి ఇప్పుడు బిగ్ బాస్ ని ప్రశ్నించండి అంటూ రెచ్చిపోయాడు.రోహిత్ ఫస్ట్ ఫైమాని టార్గెట్ చేశాడు. మద్యలో ఆదిరెడ్డి వచ్చి రోహిత్ ని ఎటాక్ చేశాడు. దీంతో రోహిత్ బ్యాగ్ ని పట్టుకోకుండానే గేమ్ ఆడాడు. థర్మాకోల్స్ మొత్తం కిందపడిపోయాయి. గేమ్ లో నుంచీ అవుట్ అయ్యాడనే ఫ్రస్టేషన్ తో రెచ్చిపోయి బ్యాగ్ ని తంతూ గొడవ గొడవ చేశాడు. ఇక్కడ క్లియర్ గా సంచాలక్ అయిన రేవంత్ బ్యాగ్ ని కిందపారేసి కాలితో కొట్టాడనే కారణంగా రోహిత్ ని అవుట్ చేశాడు.

కానీ, ఆదిరెడ్డి ఇంకా ఫైమా , శ్రీసత్య ముగ్గురూ ఉన్నప్పుడు ఫైమా రెండు మూడు సార్లు బ్యాగ్ ని కిందపారేసుకుంది. భుజానికి తాళ్లు ఉన్నా కూడా సంచి మాత్రం కిందపడిపోయింది. అయినా కూడా ఫైమాని ఎలౌ చేశాడు. అంతేకాదు, శ్రీసత్య ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. సంచాలక్ అయిన రేవంత్ చూస్తూ ఉండిపోయాడు. అసలు ఈసారి సంచాలక్ గా రేవంత్ బాగా కన్ఫూజ్ అయిపోయాడనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

రేవంత్ సంచాలక్ గా విఫలం అయ్యాడని ఫైమాకి ఫేవర్ గా వ్యవహరించాడని అందుకే ఫైమా కెప్టెన్ అయ్యిందని అంటున్నారు. అంతేకాదు, రేవంత్ కూడా సంచాలక్ గా చాలా పాయింట్స్ ని పట్టంచుకోలేదు. ఫైమా రెండు మూడుసార్లు బ్యాగ్ ని చేతులతో పట్టుకుంది. అలాగే, ఆదిరెడ్డి కూడా చేతులతో సంచిని పట్టుకున్నాడు. లాస్ట్ రౌండ్ లో శ్రీసత్య, ఇంకా ఫైమా ఇద్దరే పోరాడినపుడు ఫైమా తాడు తెగిపోతే సంచాలక్ వచ్చి కట్టాడు. దీంతో శ్రీసత్య పాయింట్ అవుట్ చేసింది. నిజానికి ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో శ్రీసత్య బాగా ఆడింది. కానీ, కెప్టెన్ మాత్రం కాలేకపోయింది. అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus