సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య వివాదం ముగిసిందా? వర్మ రీసెంట్ ట్వీట్ చూస్తుంటే ఈ విషయమే అర్థమవుతోంది. మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తొలుత రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ల దాడి చేశారు. పరిశ్రమ శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆలోచించాలి తప్ప, వితండవాదంలా సినిమా టికెట్ రేట్లను పెట్టకూడదు అంటూ తక్కువ టికెట్ ధరల విషయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫు నుండి పేర్ని నాని ట్వీట్లు చేశారు. అయితే ఇదంతా అయిపోయింది అనుకోవచ్చా.
సినిమా ఇండస్ట్రీ సమస్యల్ని పరిశ్రమ పెద్దలు మాట్లాడటం లేదు అంటూ ట్వీట్లు మొదలుపెట్టిన వర్మ వరుసగా ప్రశ్నలు సంధిస్తూనే వచ్చారు. వీడియోలు చేసి వదిలారు, ట్వీట్లు తెలుగులో రాసుకొచ్చారు. అయితే ఏమైందో ఏమో, నిన్న సాయంత్రానికి ట్వీట్లలో వేడి పూర్తిగా తగ్గిపోయింది. ‘మీరు అవకాశం ఇస్తే వచ్చి కలుస్తా… సినిమా పరిశ్రమ సమస్యలు చెబుతా’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దానికి మంత్రి పేర్ని నాని కూడా ‘‘రండి త్వరలో కలుద్దాం’ అని అనేశారు.
దీంతో ఇంత ట్వీట్ వార్ జరిగింది దీని కోసమేనా అని అందరూ అనుకుంటున్నారు. ‘‘పేర్ని నాని గారూ.. ప్రభుత్వంతో గొడవపడాలనేది నా ఉద్దేశం కాదు. సినిమా పరిశ్రమ సమస్యల గురించి మేం సరిగా చెప్పుకోలేకపోవటం వల్లో, మా కోణం నుండి మీరు అర్థం చేసుకోకపోవడ వల్లో ఈ మిస్ అండర్‌స్టాండ్ వచ్చింది. మీరు అనుమతిస్తే మిమ్మల్ని కలసి, మా సమస్యల్ని వివరిస్తాను. ఆ తర్వాత ప్రభుత్వపరంగా ఆలోచించి సరైన పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు వర్మ.
దానికి స్పందించిన మంత్రి పేర్ని నాని ‘‘థ్యాంక్యూ రామ్‌గోపాల్ వర్మ గారు. త్వరలో కలుద్దాం’’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదం ఇక చర్చల వరకు వెళ్లింది. వర్మ ఇన్నేసి ట్వీట్లు, వీడియోలు చేసే బదులు ఈ ‘మీటింగ్’ కాన్సెప్ట్ ముందే తెచ్చి ఉంటే… ఇంత రచ్చ ఉండదు కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో మీడియా అటెన్షన్ కోసం ఇదంతా చేసి ఇప్పుడు వెళ్లి కలుస్తారా అని అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో టికెట్ రేట్ల విషయంలో ఆర్.నారాయణమూర్తి తర్వాత మాట్లాడబోయేది ఆర్జీవేనే. ఇంట్రెస్టింగ్ కదా.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!