Rj Suriya: సూర్య ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉందా.? అసలు ఏం జరగబోతోదంటే..?

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఆదివారం ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. కానీ, ఈసారి నాగార్జున అనూహ్యంగా శనివారం డైరెక్ట్ గా ఒక హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేసేశాడు. దీంతో మిగతా వాళ్లు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు ఎలిమినేషన్ లో ఏదైనా ట్విస్ట్ ఇందా అని హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆర్జే సూర్య వచ్చేటపుడు కెప్టెన్ శ్రీహాన్ నువ్వు ఎక్కడికి వెళ్లవు , ఉంటావ్ అంటూ ధైర్యం చెప్పి పంపాడు. అంతేకాదు, ఇనయ అయితే సూర్య వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక్కడే కొందరు హౌస్ మేట్స్ సూర్య సీక్రెట్ రూమ్ కి వెళ్లబోతన్నాడని గెస్ చేశారు.

ఎందుకంటే, డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది ఇంతవరకూ బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. అందుకే, ఇప్పుడు గెస్ వర్కింగ్ మొదలుపెట్టారు. ఆడియన్స్ కూడా ఆర్జే సూర్య సీక్రెట్ రూమ్ కి వెళ్లాడా అనే అనుకుంటున్నారు. కానీ, ఆర్జే సూర్య నిజంగానే ఎలిమినేట్ అయ్యాడు. సీక్రెట్ రూమ్ కి వెళ్లలేదు. అంతేకాదు, ఈవారం ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా అని కూడా అనిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రాజ్ ని ఎలిమినేట్ చేసి బహుశా సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.,

ఓటింగ్ లో చూసినట్లయితే రాజ్, ఇంకా సూర్య వాసంతీ ఈ ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లలోనే బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది చేస్తారని గెస్ చేశారు అందరూ. అనుకున్నట్లుగానే సూర్యని ఎలిమినేట్ చేశారు. కానీ, డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేసరికి ఆదివారం ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తకరంగా మారింది. ఇందుకోసం ఎలిమినేషన్ ప్రక్రియని కొనసాగిస్తూనే రాజ్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నారా ? లేదా వేరే ఎవరినైనా ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి శనివారం బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ కూడా ఎలిమినేషన్ అనేది జరగలేదు.

అలా జరిగితే హౌస్ మేట్స్ అందరూ ఖచ్చితంగా అది ఫేక్ ఎలిమినేషన్ అనే అభిప్రాయపడతారు. అందుకే, వాళ్లని డైవర్ట్ చేసేందుకు ఈసారి బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం పద్దతిగా జరగాల్సిన ఆర్జేసూర్య ఎలిమినేషన్ ఇలా జరిగితే ఆడియన్స్ తో పాటుగా, హౌస్ మేట్స్ కూడా ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ ఉంటుందని అనుకుంటారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఇలా ప్లాన్ చేసి సూర్యని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేసింది. ఇక సూర్య ఎలిమినేషన్ అనేది ఫెయిర్ గానే జరిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus