మార్చి 25న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు నమోదు చేస్తుంది. తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. మిగిలిన భాషల్లో కూడా డీసెంట్ అనిపిస్తుంది. ఇప్పటికే రూ.1030 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టింది. తెలుగులో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. హిందీలో కూడా బ్లాక్ బస్టర్. మిగిలిన భాషల్లో కూడా హిట్ గా నిలిచింది. అయితే ‘బాహుబలి2’ రేంజ్లో అయితే లాభాలు రాకపోవచ్చు అనేది కన్ఫర్మ్ అయిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రం నైజాం కలెక్షన్లు ఫేక్ అనే వాదన వినిపిస్తోంది. నైజాం ఏరియాలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రూ.100 కోట్లకి పైగా షేర్ ను రాబట్టి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి భారీ లాభాలను అందించింది అంటూ కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరిగింది. కానీ డిస్ట్రిబ్యూటర్ల మాట వేరేలా ఉంది. ఇప్పటి వరకు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రూ.87 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టిందట. మరి ఆ రూ.100 కోట్ల పైన షేర్ మాట ఏంటి? అంటే జీఎస్టీ కాకుండా వచ్చిన నెట్ ను షేర్ గా ప్రచారం చేస్తున్నారట.
స్వయంగా డిస్ట్రిబ్యూటర్లే ఈ మాట చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో మాత్రమే కాదు ఇటీవల విడుదలైన అన్ని సినిమాల విషయంలో కూడా ఇలాంటి వాదనే వినిపిస్తుంది. జీఎస్టీ కాకుండా షేర్ చేసుకోవడంతో సినిమా ఫలానా సినిమా రికార్డులు కొట్టేసింది అని అంతా అనుకుంటున్నారు. ఒకవేళ నెట్ డిస్ట్రిబ్యూటర్ల లెక్క చొప్పున చూసుకున్నా ఒక్క నైజాంలోనే రూ.87 షేర్ అంటే మామూలు విషయం కాదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!