Prabhas: ఏప్రిల్‌ ఆఖరి వారం నుండి ‘సలార్‌’ పరుగులు!

ప్రభాస్ అర్జెంట్‌గా హిట్‌ కావాలి… ఇప్పుడు డార్లింగ్‌ ఫ్యాన్స్‌ను కదిపితే ఇదే మాట వినిపిస్తోంది. కారణం ‘బాహుబలి’ తర్వాత వచ్చిన రెండు సినిమాలూ ఆశించిన మేర రాణించకపోవడమే. భారీ కాన్వాస్‌, బడ్జెట్‌తో రూపొందినా సరైన ఫలితం ఇవ్వలేకపోయాయి. దీంతో అందరి చూపు ఇప్పుడు ‘సలార్‌’ మీద పడింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ లెక్కలేస్తున్నారు ప్రభాస్‌ డై హార్డ్‌ ఫ్యాన్స్‌. వారి కోసమే ఈ న్యూస్‌. ‘సలార్‌’ డేట్‌ను దాదాపుగా ఫిక్స్‌ చేసేశారని సమాచారం.

Click Here To Watch NOW

‘కేజీయఫ్‌’తో పాన్‌ ఇండియా ఫేమ్‌ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన హీరోకు ఇచ్చే ఎలివేషన్లు, పెట్టే ఫ్రేమ్‌లు… మామూలుగా ఉండవు. అంతకుముందు కూడా ఆయన ఇలానే చేసినా… ‘కేజీయఫ్‌’తోనే అవి శాండిల్‌ వుడ్‌ దాటి బయటికొచ్చాయి. అలాంటి దర్శకుడితో ప్రభాస్‌ అనేసరికి అందరికీ గూస్‌బంప్స్‌ వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూసి… ష్యూర్‌ షాట్‌ బ్లాక్‌బస్టర్ అని ఫిక్స్‌ అయిపోయారు. అందుకే రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

అభిమానులకు భారీ స్థాయి యాక్షన్‌ సినిమా సిద్ధం చేస్తున్నామని ఆ మధ్య ప్రశాంత్‌ నీల్‌ చెప్పినట్లు గుర్తు. ఈ సినిమా ఇప్పటికే పూర్తవ్వాల్సింది. ఎందుకంటే సినిమా కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం… జోరు మీద షూట్‌ చేశారు. కానీ కరోనా, ఇతర పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూట్‌ ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్‌ వేరే సినిమాలవైపు వెళ్లాడు. అలా ‘ఆదిపురుష్‌’ పూర్తి చేసేశాడు. ‘ప్రాజెక్ట్‌ కె’ మొదలెట్టేశాడు. ‘సలార్‌’కి పెద్ద గ్యాప్‌ ఇచ్చాడు. ‘రాధేశ్యామ్‌’ రావడం, వెళ్లిపోవడం పూర్తయింది కాబట్టి…

ఇక ‘సలార్‌’ స్టార్ట్‌ చేద్దామని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరిలోపు సినిమా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమా తెద్దామని చూస్తున్నారట. అంటే ఏప్రిల్‌ – మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని చెబుతున్నారు. ఇక షూట్‌ రీస్టార్ట్‌ ఎప్పుడు అనే మాటకూ ఓ ఆన్సర్‌ వినిపిస్తోంది. ‘కేజీయఫ్‌ 2’ రిలీజ్‌ అయ్యాక… ప్రచారం పనులు చూసుకొని వచ్చే నెలా ఖరులో కానీ, మే మొదటి వారంలో కానీ సినిమా పనులు మొదలుపెడతారట.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus