Samantha: సమంత బాలీవుడ్‌ సినిమాపై కొత్త అప్‌డేట్‌

బాలీవుడ్‌లో సత్తా చాటడానికి సమంత ప్రయత్నాలు చేస్తోందనే విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని కూడా విన్నాం. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను తాప్సి నిర్మిస్తోందని అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మల్టీస్టారర్‌ అని తెలుస్తోంది. అవును బాలీవుడ్‌లో సామ్‌ ఎంట్రీ మల్టీస్టారర్‌ అని టాక్‌. అవుట్‌ సైడర్స్‌ పేరుతో తాప్సి ఇటీవల ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది.

అందులో తాప్సి, సమంత కలసి ఈ సినిమా చేస్తారట. తొలుత ఈ సినిమా కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌నే అనుకున్నారట. అయితే సమంతను తీసుకుంటే… సౌత్‌లో కూడా సినిమా మంచి క్రేజ్‌ వస్తుందని, దాని ద్వారా పాన్‌ ఇండియా సినిమా రూపు వచ్చేస్తుందని అనుకుంటున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. మన సినిమాల్లో మల్టీస్టారర్‌ అంటే హీరోలు మాత్రమే. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో మల్టీస్టారర్లు పెద్దగా చూసింది లేదు. ఇప్పుడు తాప్సి,

సమంత కలసి ఈ పని చేయబోతున్నారట. అయితే కథేంటి, ఎప్పుడు మొదలు అనేవి తెలియాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్‌లో అంతో కొంత పేరు తెచ్చుకున్న సమంత ఇలా మల్టీస్టారర్‌ చేయడం బాలీవుడ్‌ కెరీర్‌ స్టార్ట్‌కి మంచిదేనా అనేది ఆలోచించాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus