Marco: స్టార్ హీరోతో ‘మార్కో’ రీమేక్.. పెద్ద షాక్ ఇది..!

ఎన్టీఆర్ (Jr NTR)– కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). దీని తర్వాత అనుష్క (Anushka Shetty) నటించిన ‘భాగమతి’ (Bhaagamathie), రవితేజ (Ravi Teja) నటించిన ‘ఖిలాడి’ (Khiladi) , సమంత (Samantha ) నటించిన ‘యశోద’ (Yashoda) వంటి సినిమాల్లో కూడా నటించి ఇక్కడ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇతను హీరోగా మలయాళంలో ‘మార్కో’ (Marco) అనే సినిమా రూపొందింది. 2024 డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Marco

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఉన్ని ముకుందన్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా డబ్ అయ్యి అక్కడ కూడా మంచి వసూళ్లు సాధించింది. వాస్తవానికి ‘మార్కో’ లో గొప్ప కథ ఏమీ ఉండదు. ఎమోషన్స్ వంటివి కూడా ఏమీ ఆశించలేం. సినిమా నిండా హింసే ఉంటుంది. హీరో మొదటి నుండి విలన్ గ్యాంగ్ ని టార్గెట్ చేసి చంపుతుంటే.. చివర్లో విలన్ గ్యాంగ్ వచ్చి హీరో ఫ్యామిలీని చంపుతుంది.

తర్వాత హీరో వెళ్లి మిగిలిన విలన్ గ్యాంగ్ ని చంపుతాడు. ఒక్క లైన్లో చెప్పాలంటే ఇదే కథ. కానీ హీరో ఫ్యామిలీని విలన్ గ్యాంగ్ ఎటాక్ చేసి చంపే ఎపిసోడ్ చాలా దారుణంగా ఉంటుంది. చిన్న పిల్లాడి మొహంపై గ్యాస్ సిలిండర్ తో విలన్ కొట్టి కొట్టి చంపడం, ఆడవాళ్ళ బుగ్గలని చీల్చేయడం, గర్భంతో ఉన్న అమ్మాయి పొట్ట పై కొట్టి.. శిశువుని బలవంతంగా బయటకు లాగేయడం.. తర్వాత ఆమె గొంతులో కత్తి దింపడం.. ఇలాంటి సన్నివేశాలు నిద్ర లేకుండా చేస్తాయి. ఇవన్నీ నిజంగానే జరిగాయి అనేంతలా తెరకెక్కించిన టెక్నికల్ టీం పనితీరుని మెచ్చుకోవచ్చు.

ఇలాంటి సినిమా తమిళంలో ఓ స్టార్ హీరో రీమేక్ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అతను మరెవరో కాదు చియాన్ విక్రమ్ (Vikram). ఇది నిజంగా షాక్ ఇచ్చే విషయమే. విక్రమ్ చేసే కథలన్నీ కొత్తగా ఉంటాయి. కానీ ఇంత హింసాత్మక సినిమా అతనికి సెట్ అవుతుందా? కచ్చితంగా నో అనే చెప్పాలి. అయితే ‘మార్కో’ రీమేక్ విక్రమ్ చేస్తున్నట్టు కాస్త గట్టిగానే టాక్ వినిపిస్తుంది. అది అబద్దం అయితే బాగుణ్ణు అని చాలా మంది కోరుకుంటున్నారు.

బాలయ్యతో రెండో సినిమా కోసం గోపీచంద్‌ కొత్త ప్లానింగ్‌.. తమన్‌ని కాదని..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus