నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు థమన్ ఇచ్చిన బీజీఎం నచ్చకపోవడంతో నాని థమన్ కు బదులుగా గోపీసుందర్ తో ఆ సినిమాకు బీజీఎం చేయించారు. నానికి నచ్చకపోవడం వల్లే టక్ జగదీష్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించలేదని థమన్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అఖండ సినిమాకు బీజీఎం విషయంలో థమన్ కు ప్రశంసలు దక్కాయి.
థమన్ బీజీఎం లేకపోతే అఖండ సినిమా ఆకట్టుకునేది కాదని చాలామంది నెటిజన్లు భావించారు. అఖండ సక్సెస్ తో రాధేశ్యామ్ సినిమాకు బీజీఎం అందించే అవకాశం థమన్ కు దక్కింది. ప్రభాస్ థమన్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా రాధేశ్యామ్ కావడం గమనార్హం. థమన్ బీజీఎం అందిస్తున్నట్టు వెలువడిన ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. అయితే తాజాగా నాని కామెంట్లకు కౌంటర్ ఇచ్చి థమన్ అభిమానులను అవాక్కయ్యేలా చేశారు.
నాని తాజాగా తన సినిమాలలో అన్ని క్రాఫ్ట్స్ లా సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంటుందని మ్యూజిక్, బీజీఎం సినిమాను ఎలివేట్ చేయాలే తప్ప డామినేట్ చేయకూడదని అన్నారు. మ్యూజిక్ లేదా బీజీఎం డామినేట్ చేస్తే శృతి తప్పుతుందని నాని చెప్పుకొచ్చారు. నాని థమన్ ను ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారని చాలామంది భావించారు. అయితే థమన్ కూడా నాని పేరెత్తకుండా వరుస ట్వీట్లు చేశారు. అన్ని క్రాఫ్ట్ లు కలిసి పని చేస్తే మాత్రమే సినిమా సక్సెస్ సాధిస్తుందని థమన్ చెప్పుకొచ్చారు.
ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా దేనినీ డామినేట్ చేయదని థమన్ తెలిపారు. అన్ని విభాగాలు సరిగ్గా ఉంటే మాత్రమే సినిమాను కంప్లీట్ ఫిల్మ్ అంటామని థమన్ అన్నారు. నానికి షాకిచ్చేలా ట్వీట్లు చేసి థమన్ నానిపై పగ తీర్చుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాని థమన్ భవిష్యత్తులో కలిసి పని చేసే ఛాన్స్ లేదని చెప్పవచ్చు.
We call it a Complete FILM when all the crafts Together Excel in all formats 🥁It’s never so called Dominated Crafts .. lol
it’s the Deeper UNDERSTANDING of a Film Knowing it’s depth in dialogues it’s Narration & making It dive in Smooth to the Next Sequences 🎥🎵🥁