Pawan Kalyan: ‘భవదీయుడు…’ డైలాగ్‌ నిజమైతే ట్రోలింగ్‌ ఆపలేం!

కనీసం సినిమా షూటింగ్‌ మొదలవ్వలేదు. ఆ మాటకొస్తే ముహూర్తపు షాట్‌ కూడా పడలేదు. కానీ సినిమా నుండి డైలాగ్‌ లీక్‌ అయ్యింది. చేసింది ఎవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. ఆ సినిమా ఏంటి, ఆ డైలాగ్‌ ఏంటి, ఈ కథేంటి అనేది. మొన్నీ మధ్య ‘ఆచార్య’ సినిమా ప్రచారంలో భాగంగా చిరంజీవి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సినిమాలోని డైలాగ్‌ను చెప్పేశాడు. అయితే ఇక్కడ డౌట్‌ ఒక్కటే.. నిజంగా ఆ డైలాగ్‌ హరీశ్‌ శంకర్‌ రాశారా? ఏంటీ.. ఈ డౌట్‌ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? దీనికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు.

Click Here To Watch NOW

అందులో తొలి కారణం… ఆ డైలాగ్‌ను చిరంజీవికి చెప్పింది ఎవరు. పవన్‌ కల్యాణ్‌ సినిమా కథను చిరంజీవి వినే రోజులు పోమాయి. పవన్‌ సొంతంగానే నిర్ణయం తీసుకుంటున్నారు. అందులోనూ కథ వినడం వరకు అయితే, ఏదో చెప్పారు అనుకోవచ్చు. ఏకంగా సినిమా డైలాగ్‌ వెర్షన్‌ వినే అవకాశం తక్కువ. ఇక రెండో కారణం చూద్దాం. సినిమాలోని డైలాగ్‌ అంటూ చిరంజీవి చెప్పిన మాటలు ‘కేజీయఫ్‌’లోని డైలాగ్‌కి బాగా దగ్గరగా ఉన్నాయి. హరీశ్‌ శంకర్‌ ఇలా రీమిక్స్‌ డైలాగ్స్‌ రాయరు అని అంటున్నారు నెటిజన్లు. గతంలో హరీశ్‌ శంకర్‌ రైటింగ్‌ స్టైల్‌ చూస్తే ఎవరైనా చెప్పేయొచ్చు అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ లాంటి పెద్ద హీరోకు మాటలు రాసేటప్పుడు ఇలా రీమిక్స్‌ డైలాగ్స్‌ ఎంచుకోరు అని అంటున్నారు నెటిజన్లు. మరి చిరంజీవి చెప్పిన డైలాగ్‌ ఎక్కడ, ఎవరు అతనికి చెప్పి ఉంటారు. హరీశ్‌ శంకర్‌ ఒకవేళ రాయకపోయుంటే, చెప్పకపోయుంటే సినిమా కాన్సెప్ట్‌ తెలిసి చిరంజీవే స్పాంటేనియస్‌గా అనుకొని చెప్పేశారా అనే అనుమానాలూ ఉన్నాయి. చిరంజీవిలో ఈ టాలెంట్‌ కూడా ఉందని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఆ లెక్కన చిరంజీవి చెప్పిన డైలాగ్‌ సంగతి అనుమానమే అనొచ్చు. ఇంతకీ ఆ డైలాగ్‌ ఏంటి అనేదేగా మీ ప్రశ్న.

‘‘ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట ల‌క్ష‌లాది మంది స్టూడెంట్స్ న‌డిచి వ‌స్తుంటే.. ‘వీడు న‌డిస్తే వెనుక ల‌క్ష‌మంది న‌డుస్తారు.. బ‌హుశా అదే వీడి ధైర్య‌మేమో…’ అని విల‌న్ అంటే, ప‌క్క‌నున్న‌వాడు.. ‘కాదు సార్‌.. ఆ వెనుక ల‌క్ష‌మందికి వీడున్నాడ‌న్న‌దే ధైర్యం’ అని అంటాడు. ఇదే చిరంజీవి లీక్‌ చేసిన డైలాగ్‌. ఇక ‘కేజీయఫ్‌’ డైలాగ్ అయితే… ‘నీ వెన్నంటి వేల‌మంది ఉన్నార‌న్న ధైర్యం నీకు ఉంటే.. నువ్వొక్క‌డివే గెలుస్తావ్.. అదే నువ్వు ముందున్న‌వన్న ధైర్యం నీ వెనుక ఉన్న‌వాళ్ల‌కుంటే.. ఈ ప్ర‌పంచాన్నే గెలుస్తావ్..’. ఈ రెండూ దగ్గరగా ఉన్నాయి కదా.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus