Chiranjeevi: రూ.60 లక్షలు నష్టం తెచ్చిన సినిమా వెనుక అంత కథ ఉందా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2008 ఆగస్టులో చిరు ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించడం జరిగింది. వెంటనే 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రం వీడిపోని రోజుల్లో ప్రజారాజ్యం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కచ్చితంగా చిరంజీవి వల్ల రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అంతా భావించారు. 30 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ 18 స్థానాల్లో మాత్రమే ‘ప్రజారాజ్యం’ పార్టీ విజయం సాధించడం జరిగింది. తర్వాత పార్టీని బలోపేతం చేయాలని చిరు అనుకున్నారు.

Chiranjeevi

కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆయన కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఆ తర్వాత మంత్రిగా చేసినా.. ఎందుకో చిరుకి రాజకీయాలు సంతృప్తినివ్వలేదు. ఒక మంచి టైం చూసుకుని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక తన ‘ప్రజారాజ్యం’ పార్టీ ‘జనసేనగా’ గా రూపాంతరం చెందింది అని చిరు ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే చిరుకి పొలిటికల్ ఎంట్రీ పై మోజు పెరిగేలా చేసిన సినిమా ఏంటి? అంటే చాలా మంది ‘ఇంద్ర’ (Indra) ‘ఠాగూర్’ (Tagore) ‘స్టాలిన్’ (Stalin) వంటి సినిమాల పేర్లు చెబుతారు.

కానీ వాస్తవానికి అవేవీ కావు. చిరుకి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే కోరికని రేకెత్తించిన సినిమా ‘రుద్రవీణ’ (Rudraveena). 1988 లో వచ్చిన సినిమా ఇది. కె.బాలచందర్ (K. Balachander) దర్శకుడు. ఈ సినిమాలో చిరు ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా చిరు కనిపిస్తారు. కానీ తండ్రి చాదస్తం,జనాలపై అతను వివక్ష చూపించడం వంటివి హీరోకి నచ్చవు. ఊరు బాగు పడాలి, ఊర్లో జనాలని మంచి దారిలో నడిపించాలి అని ఈ సినిమాలో హీరో డిసైడ్ అవుతాడు. ఇందులో సూర్యనారాయణ శాస్త్రి అలియాస్ సూర్యం అనే పాత్రలో చిరు కనిపించారు.

ఈ సినిమా చూడటానికి బాగుంటుంది. ఓ క్లాసిక్ అని చెప్పొచ్చు. కానీ ఆ టైంలో ఇది ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది. ‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నాగబాబు (Nagendra Babu) ఈ సినిమాని రూ.80 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. ఫైనల్ గా ఏకంగా రూ.60 లక్షల వరకు నష్టాలు మిగిల్చింది. అయితే ఈ సినిమాలో ‘నేను సైతం’ అనే పాట ఉంటుంది. ఈ పాటలో నటిస్తున్న టైంలో చిరుకి ఎప్పటికైనా రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన కలిగిందట. ఓ సందర్భంలో చిరు స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.

మొత్తానికి ఓటీటీకి రాబోతున్న ‘ఏజెంట్’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus