Akhanda Movie: టికెట్ రేట్ల తగ్గింపు కూడా బాలయ్యకి కలిసొచ్చిందా..!

ఏపిలో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యు.. గత 7 నెలల నుండీ హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. జగన్ ప్రభుత్వం టాలీవుడ్ పై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుందనేది అందరి మాట. అయితే టికెట్ రేట్ల తగ్గింపు వల్లే పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు అన్నది అందరికీ తెలిసిన సంగతే..! అసలే కరోనా వల్ల విడుదలకు నోచుకోని పెద్ద సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు టికెట్ రేట్ల ఇష్యు వల్ల వాటిని నిర్మాతలు ఆపుకుని కూర్చున్నారు.

వాటి వడ్డీల భారం కూడా వాళ్ళ పై భారీగానే పడుతుంది. అయినప్పటికీ ఏపి ప్రభుత్వం ఇవేమి పట్టనట్టే.. కక్ష్య సాధింపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇన్ని అడ్డంకుల నడుమ ఈరోజు ‘అఖండ’ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభిస్తుంది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో జరిగాయి. దాంతో మొదటి రోజు ఈ చిత్రం రూ.11 కోట్ల వరకు వసూళ్ళు నమోదవుతాయని ట్రేడ్ అంచనా వేస్తుంది.

అయితే టికెట్ రేటు రూ.100 ఉంటేనే ఇంత కలెక్ట్ చేస్తే.. టికెట్ రేటు రూ.200 ఉంటే ఈ చిత్రం 3 రోజుల్లోనే బేక్ ఈవెన్ సాధిస్తుందని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ సినిమాలకు రూ.200 టికెట్ రేట్లు కనుక ఉంటే ఇంతలా హౌస్ఫుల్స్ పడే అవకాశం లేదని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.పైగా ఇప్పుడు ఒమిక్రాన్ భయం కూడా జనాలకి పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ రేటు రూ.200 ఉంటే మాత్రం ‘అఖండ’ ని జనాలు ఓటిటిలో చూసుకోవచ్చని లైట్ తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus