‘డిస్కో రాజా’ మళ్ళీ మొదటికొచ్చాడు..!

గతేడాది మాస్ మహా రాజ్ రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. రొటీన్ మాస్ ఎంటర్టైనర్లు కావడంతో… థియేటర్లకి రావడానికి జనం మొహం చాటేశారు. ఈ డిజాస్టర్ల ఎఫెక్ట్ రవితేజ రెమ్యూనరేషన్ మరియు మార్కెట్ పై పడింది. ఇక దీంతో రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశంతో, వీఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభ ఏంటనేది చూపించాడు వీఐ ఆనంద్.

ఇక ‘డిస్కోరాజా’ చిత్రం ఇటీవలే ప్రారంభం అవుతుందని వార్తలొచ్చాయి. అయితే రవితేజ మాత్రం ఈ చిత్రం పై.. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాడట. ఇప్పటికే ఇదే స్టోరీ లైన్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం సెట్స్ పై ఉంది. ఈ విషయం ఇటీవలే.. రవితేజ దృష్టికి వచ్చిందట. దీంతో సమయం తీసుకుని కొంచెం మార్పులు చేయమని రవితేజ… దర్శకుడు వీఐ ఆనంద్ కి సూచించాడట. ఇప్పుడు వీఐ ఆనంద్ కూడా అదే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ రవితేజకి సంతృప్తిని కలిగించిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట. ఇక ఈ స్క్రిప్ట్ మొత్తం మారిన తరువాతే సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. ఇలా రవితేజ మళ్ళీ మొదటికి రావడం.. ఆయన అభిమానులు అసంతృప్తికి గురవుతున్నట్టుగా తెలిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus