Singer: మిన్ మిని అలా చేయడం వల్లే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అలా చేశాడా?

‘రోజా’ చిత్రంలోని ‘చిన్న చిన్న ఆశ’ పాట ఎంతగా ఫేమస్‌ అయిందో తెలిసిందే. 1992 సమయంలో సింగర్‌ మిన్‌మిని పాడిన ఈ పాట ఓ ట్రెండ్‌ అనొచ్చు. ‘రోజా’ చిత్రంతో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రానికి అప్పట్లో స్టార్స్‌ సింగర్స్‌ సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను ఉన్నా వారిని పక్కనపెట్టి కొత్త గాయని మిన్‌మినితో ‘చిన్ని చిన్న ఆశ’ పాటను పాడించారు. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లో ఆమె ఈ పాటను పాడి ఆ సినిమాకే ఊపిరి పోసింది. దురదృష్టం ఏంటంటే ఆ చిత్రం తర్వాత మిన్‌మినికి ఏ అవకాశం రాలేదు.

1991 నుంచి 1994 వరకు ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు పాడిన ఆమె కెరీర్‌ ఎందుకు ముగిసిందో చెప్పుకొచ్చారు మిన్‌మిని. రోజా సినిమాలో పాట పాడక ముందు మిన్‌మిని మాస్ట్రో ఇళయరాజా టీమ్‌లో ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఉండేవారట. తను ఏ.ఆర్‌.రెహమాన్‌ మొదటి సినిమాలో పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే వేరే కంపోజర్‌ దగ్గరగా ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయరాజా నిబంధన పెట్టారని మిన్‌మిని చెప్పారు.

‘‘ఆయన మాటలను తట్టుకోలేక ఏడ్చేశాను. రికార్డింగ్‌ స్టూడియోలోనే ఇదంతా జరగడంతో అక్కడున్న వారంతా నా ఏడుపు విన్నారు. సింగర్‌ మనో నన్ను ఓదార్చారు. ఆ తర్వాత ఇళయారాజాగారు పాటలు పాడేందుకు నన్ను పిలవడం మానేశారు. ఒక లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్‌గా అనుకోకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదు.

(Singer) నా కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయాను. అయితే 2015లో లక్కీగా మళ్లీ రెహమాన్‌ మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. తదుపరి ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చింది’’ అని అన్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus