పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి కదా.. ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదేంటి అని అనుకుంటున్నారా? అవును మూడు సినిమాలు అయితే ఉన్నాయి కానీ అవేవీ తెలుగు సినిమాలు కావు. గత కొన్ని రోజులుగా ఆమె తెలుగు సినిమా ఓకే చేసింది అని వార్తలొస్తున్నా.. ఏదీ ఓకే అవ్వడం లేదు. చాలామంది హీరోల పేర్లు వినిపించినా ఫైనల్ అవ్వలేదు. అయితే, తాజాగా ఆమెకు ఓ తెలుగు సినిమా ఛాన్స్ వచ్చింది అంటున్నారు.
తెలుగులో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కొత్త తెలుగు సినిమా ఓకే చేశాడు అని అంటున్నారు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాతో హిట్‌ను ఖాతాలో వేసుకున్న దుల్కర్ ప్రస్తుతం ‘కాంత’, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రవి అనే కొత్త దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడు అని సమాచారం. ఆ సినిమాకే కథానాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమా వస్తుంది అనే టాక్ కూడా నడుస్తోంది. త్వరలోనే సినిమా నుండి మేజర్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెప్పొచ్చు. అప్పుడు మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇక దుల్కర్ సినిమాల గురించి పైనే చెప్పుకున్నాం. ‘కాంత’ అని తమిళ, తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక స్ట్రెయిట్ తెలుగుగా పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతే కొత్త సినిమా ఉండొచ్చు.
ఇక పూజా హెగ్డే సినిమాల సంగతి చూస్తే.. హిందీలో ‘దేవా’ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. అది కాకుండా తమిళంలో సూర్యతో (Suriya) ఓ సినిమా, విజయ్‌తో (Vijay Thalapathy) మరో సినిమా చేస్తోంది. తెలుగులో నాగచైనత్యతో (Naga Chaitanya) ఓ సినిమా చేస్తుంది అని వార్తలొచ్చినా అవి ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో దుల్కర్ అయినా సరే పూజా హెగ్డేకి విజయం అందిస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఆమె గత తెలుగు చిత్రాలు వరుసగా పరాజయంపాలైనవే.