సంక్రాంతి పండుగ కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించగా ఈ రెండు సినిమాలు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు రిలీజైన సమయంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో కొంతమంది ఈ సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. టికెట్ రేట్లు తగ్గిస్తే ఈ సినిమాలను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు భావించగా టికెట్ రేట్లు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు.
టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మైత్రీ నిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో చొరవ తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. సంక్రాంతి సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు మరిన్ని రికార్డులను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంక్రాంతి సినిమాలు మరో రెండు వారాల పాటు థియేటర్ల వద్ద సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.
చిరంజీవి, బాలయ్య ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఆయా హీరోల అభిమానులకు ఈ సినిమాలు తెగ నచ్చేయడం గమనార్హం. చిరంజీవి, బాలయ్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా వీళ్లిద్దరూ కలిసి నటించే అవకాశాలు అయితే దాదాపుగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస విజయాలు చిరంజీవి, బాలయ్య రేంజ్ ను పెంచాయి. చిరంజీవి, బాలయ్యలకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
అన్ స్టాపబుల్ షో బాలయ్య ఇమేజ్ ను పెంచిందని కామెంట్లు వ్యక్తమవువుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం 50 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా బాలయ్య 16 నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో పరితోషికం తీసుకుంటున్నారు. బాలయ్య ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!