Pawan Kalyan: పవన్‌ పోటీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో కాదా..!

  • November 19, 2021 / 01:38 PM IST

నా అనుకున్నవారి కోసం ఎంత దూరమైనా వెళ్లాలి… అని చెబుతుంటారు మన పెద్దలు. ఇలా అందరిలో కొందరు అనుకుంటే కుదరదు, అందరూ అనుకోవాలి అని కూడా చెబుతారు. అలా గుంపులో ఒకరు ముందుకొస్తే… మిగిలినవాళ్లు సపోర్టు చేయాలి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ కాన్సెప్ట్‌ సరిగ్గా అమలవ్వకే టాలీవుడ్‌ సంక్రాంతి పోరు జటిలంగా మారింది. అవుననే అంటున్నాయి పరిశీలకులు. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ మాత్రమే బరిలో ఉంటాయని అందరూ అనుకున్నారు. పరిస్థితులు కూడా అలానే కనిపించాయి. అయితే అనూహ్యంగా ముందు చెప్పిన డేట్‌కి కట్టుబడి ఉంటాం అంటూ ‘భీమ్లా నాయక్‌’ టీమ్‌ ప్రకటించింది.

పెద్ద సినిమాలు మూడూ ఒకేసారి వస్తే ఇబ్బందే అని అనుకుంటున్నారు. ఒక విధంగా చూస్తే… ఇది నిజమే. పెద్ద సినిమాలు వరుసగా వస్తే… కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తక్కువగా ఉన్నాయి. ఉన్నవాటిని అడ్జెస్ట్‌ చేసుకోలేం. ప్రేక్షకులు అన్ని సినిమాలూ చూస్తారు అనుకోలేం. దీని వల్ల పెద్ద సినిమాలకు వసూళ్లు తగ్గుతాయి. రెండోది అనవసరంగా అభిమానుల మధ్య పోటీ పంచాయితీలు. దీంతో పెద్ద సినిమాలు ఒకేసారి వద్దు అంటారు. ఇదంతా ‘భీమ్లా నాయక్‌’ టీమ్‌కి తెలియదు అని కాదు. అయితే పవన్‌ కల్యాణ్‌ నిర్ణయంతోనే సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ టీమ్‌ సంక్రాంతి బరి నుండి తప్పుకోకూడదు అనుకుందట.

పరిశ్రమ గురించి, టికెట్ల సమస్య గురించి… ఏపీ ప్రభుత్వంతో తాను తలపడాలని చూస్తే… పరిశ్రమ నుండి తనకెలాంటి సపోర్టు రాలేదని పవన్‌ అనుకుంటున్నారని వినికిడి. తన విషయంలో సపోర్టు చేయని వారి కోసం ఇప్పుడు రిలీజ్‌ మార్చి నేను చేయాలా అని పవన్‌ అనుకుంటున్నాడు అంటూ కొన్ని వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, సినిమా వాయిదా కోసం చాలామంది పవన్‌ను సంప్రదిద్దామని ట్రై చేస్తున్నా ఆయన వినిపించుకోవడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏదో ఒక వర్గం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus