Rashmika: క్రష్మిక వరుస సినిమాలకు కారణమిదేనా? మిగిలినవాళ్లకు ఈ ఆలోచన రాలేదా?

‘ఛలో’ సినిమా చూసినప్పుడు కొత్త హీరోయిన్ టాలీవుడ్‌కి వచ్చింది అని అనుకున్నారంతా. కానీ అలా వచ్చిన కొత్త నాయిక ఇప్పుడు దేశం మొత్తానికి క్రష్‌గా మారిపోతుందని చాలా తక్కువమందే ఊహించి ఉంటారు. అలాంటివారిలో మీరు ఉంటే మీరు గ్రేట్‌ అంతే. ఎందుకంటే అందులో ఆమె లుక్‌ సగటు సౌత్‌ హీరోయిన్‌లా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌. ఎడాపెడా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేసేస్తోంది. సౌత్‌ భామ కాబట్టి.. సౌత్‌ సినిమాలు వస్తున్నాయంటే ఓ లెక్క. కానీ బాలీవుడ్‌లో ఎలా అనేది ప్రశ్నగా మారింది.

బాలీవుడ్‌లో హీరోయిన్ అవ్వాలంటే, అయ్యి నిలదొక్కుకోవాలంటే కొన్ని క్వాలిటీస్‌ ఉండాలి అంటారు. అక్కడి అమ్మాయి అయి ఉండాలి. లేదంటే అక్కడే ఉండిపోవాలి. అలాగే కాస్త స్లిమ్‌గా ఉండాలి, వీలైతే జీరో సైజ్‌ అవ్వాలి. స్కిన్‌ షోకి నో చెప్పకూడదు. అయితే ఇవేవీ ఎక్కడా గ్రంధస్తం అయి ఉండవు అనుకోండి. అక్కడ స్టార్‌లు అయినవాళ్లను చూసి అనధికారికంగా రాసుకున్న మాటలివి. అయితే ఇందులో చాలా అంశాలు రష్మికకు వర్తించవు. కానీ ఇప్పుడు ఆమెకు అక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి.

దీంతో అసలు ఇదంతా రష్మికకు (Rashmika) ఎలా సాధ్యమవుతోంది అనే చర్చ మొదలైంది. ఆ మాటకొస్తే బాలీవుడ్‌లో ఇప్పటివరకు విడుదలైన సినిమాలు కూడా సరైన విజయం అందుకోలేదు. కానీ అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఆ చర్చ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తోంది. షాహిద్ కపూర్ సరసన ఒక సినిమా ఛాన్స్‌ సంపాదించింది అని టాక్‌. ఇద కాకుండా పెద్ద హీరో సినిమా ఇంకొకటి ఉంది అంటున్నారు.

‘పుష్ప’ సినిమాతో నార్త్ ఇండియాలోనూ శ్రీవల్లి అలియాస్‌ క్రష్మిక అలియాస్‌ రష్మికకు క్రేజ్ వచ్చింది. అలా ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ చేసింది. అవి పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. దానికి తోడు ముంబయిలో టాలెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంద. ఆ సంస్థే హిందీ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తోంది అని టాక్. అయితే ఈ పని ఇతర సౌత్‌ హీరోయిన్లు చేయలేకపోతున్నారా అనేది ప్రశ్న.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus